
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- నవంబర్ ఒకటవ తేదీ నుంచి కొన్ని కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఇప్పటివరకు ఆధార్ కార్డుకు సంబంధించి పేరు మార్పు గానీ, అడ్రస్ మార్పు, డేట్ అఫ్ బర్త్ , మొబైల్ నెంబర్ ను చేంజ్ చేయాలంటే చాలానే సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చేది. కానీ నవంబర్ ఒకటవ తేదీ నుంచి ఇవన్నీ కూడా ఇంటి వద్ద నుంచే అప్డేట్ చేసుకోవచ్చుని తాజాగా అధికారులు ప్రకటించారు. వీటి మార్పు కోసం కేవలం 75 రూపాయలు మాత్రమే చార్జీ చెల్లించాలి అని తెలియజేశారు. కానీ బయోమెట్రిక్ అప్డేట్ కోసం మాత్రం ఖచ్చితంగా ఆధార్ కేంద్రానికి వెళ్లాలి అని సూచించారు. బయోమెట్రిక్ అప్డేట్ కోసం 125 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది అని స్పష్టం చేశారు. ఇక మరోవైపు బ్యాంక్ అకౌంట్స్, లాకర్స్ లేదా సేఫ్ కస్టడీ కోసం గతంలో ఒకరు మాత్రమే నామినీగా గా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ నవంబర్ 1వ తేదీ నుంచి ఈ బ్యాంక్ అకౌంట్స్, లాకర్స్ అలాగే సేఫ్ కస్టడికు నలుగురు నామినీలను పెట్టుకోవచ్చని ఆదేశాలు జారీ చేశారు. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ఎడ్యుకేషన్ పేమెంట్లకు ₹1000 పోయినా వాలెట్ రీఛార్జ్ కు ఒక శాతం మాత్రమే ఫీజు వర్తిస్తుంది అని వెల్లడించారు. కాబట్టి ప్రజలందరూ కూడా వీటిని గమనించి ఇంటి వద్ద నుంచి పనులను పూర్తి చేసుకోవాల్సిందిగా అధికారులు కోరారు.
Read also : విజయ్ కి ఎదురు దెబ్బ.. నష్టపరిహారపు 20 లక్షలు మాకొద్దు అంటున్న బాధితురాలు
Read also : పెబ్బేరు నుంచి ఇరుముడితో శబరిమలకు మహాపాదయాత్ర..!





