
క్రైమ్ మిర్రర్, వనస్థలిపురం : బి.యన్. రెడ్డి నగర్ డివిజన్ పరిధిలో గౌతమి నగర్ కాలనీలో నూతన సంక్షేమ సంఘం కార్యవర్గం ఏర్పడిన సందర్భంగా సభ్యులు మంగళవారం జిహెచ్ఎంసి ( Greater Hyderabad Municipal Corporation ) కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాలనీలో అభివృద్ధి పనులు, ప్రస్తుత సమస్యల పరిష్కారానికి సంబంధించి వినతిపత్రాన్ని అందజేశారు. కార్పొరేటర్ నూతన కార్యవర్గాన్ని అభినందించి, కాలనీలో వచ్చే రోజుల్లో తగిన ప్రాధాన్యతనిస్తూ అన్ని సమస్యలను పరిష్కరించేందుకు తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షుడు సుధాకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కిషన్, ట్రెజరర్ సాయిబాబా, ఉపాధ్యక్షులు రాజు, నారాయణరావు, జాయింట్ సెక్రటరీలు గోపీచంద్, హరి రెడ్డి, సుకుమార్, ఆంజనేయులు, లోకేష్ చారి, ఆర్గనైజింగ్ సెక్రటరీ కరుణాకర్, పి.హెచ్. రెడ్డి, రవికుమార్, కార్యవర్గ సభ్యులు భాస్కర్ గౌడ్, జగన్, శ్రీ రామ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.