జాతీయం

తప్పనిసరిగా “సంచార్ సాథీ” యాప్.. విమర్శిస్తున్న నెటిజనులు!

క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- మన భారతదేశంలోని ప్రతి మనిషి ఉపయోగించే ఫోన్ లో సంచార్ సాథీ యాప్ కచ్చితంగా ఉండాలన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఈ విషయం ఇప్పటికే చాలామందికి తెలిసే ఉంటుంది. మన దేశవ్యాప్తంగా నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ యాప్ ను ప్రతి ఒక్క ఫోన్లలో డిలీట్ చేయకుండా ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దేశంలో నేరాలకు అడ్డుకట్ట వేసే విధంగా మొబైల్ తయారీ సంస్థలకు కేంద్రం ఇప్పటికే కీలక ఆదేశాలు ఇచ్చినట్లు నేషనల్ మీడియా తాజాగా వెల్లడించింది. ఇకపై మన దేశంలో తయారయ్యే ప్రతి ఫోన్లో తప్పనిసరిగా ఈ ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ యాప్ సంచార్ సథీ యాప్ ను డిఫాల్ట్ గా ఇవ్వాలని స్పష్టం చేశారు. తద్వారా ఈ యాప్ ను ఎవరూ కూడా డిలీట్ చేయలేరు. రాబోయే మూడు నెలల లోపు ప్రతి ఒక్క ఫోన్ లో కూడా ఈ యాప్ ఉండాలి అని గడువు కూడా ఇచ్చారు. అయితే ఈ అంశంపై ఒకవైపు ప్రభుత్వం మరోవైపు మొబైల్ కంపెనీలు మాత్రం అధికారికంగా స్పందించలేదు. కానీ సోషల్ మీడియాలో ఇప్పటినుంచి కేంద్ర నిర్ణయం పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నేరాలకు అడ్డుకట్ట వేసే పేరుతో ప్రజలపై నిగా పెట్టాలని చూస్తున్నారని ప్రతిపక్షాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. నార్త్ కొరియా దేశంలో తమపై కేంద్రం నిఘా పెడతారా అని సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది నిటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరి కేంద్రం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి.

Read also : మును(గోడు) మార్చే బీసీ నాయకుడెవరు…ఎవరిని నిర్ణయిస్తారో..?

Read also : సీఎం ఫిర్యాదుదారులను బెదిరించి మరీ కేసులను మూయిస్తున్నారు : బొత్స సత్యనారాయణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button