
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విషయంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఫిరాయింపు ఎమ్మెల్యేలు అయినటువంటి తెల్లం వెంకటరావు, గాంధీ, కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, మహిపాల్ రెడ్డి లపై అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ వారికి క్లీన్ చేయటంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే స్పీకర్ గడ్డం ప్రసాద్ వారు పార్టీ ఫిరాయించినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవు అని స్పష్టం చేశారు. ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా సాంకేతికంగా బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్లుగా అతను వెల్లడించారు.
Read also : పంచాయతీ ఎన్నికలలో మాదే హవా : సీఎం రేవంత్
అయితే తాజాగా ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం పై నేను కానీ మా పార్టీ కానీ ఎటువంటి విధంగాను స్పందించబోము అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సొంత ఎమ్మెల్యేలు తమ పార్టీలో లేరు అని చెప్పుకునేటువంటి దౌర్భాగ్య స్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది అని రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా సరే స్పీకర్ నిర్ణయం నచ్చకపోతే మీరు న్యాయస్థానాల కైనా వెళ్ళవచ్చు అని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఈ ప్రతిపక్ష పార్టీలకు ఇంకా బలుపు తగ్గలేదు అంటూనే.. మీరు ఇలానే ఉంటే 2029 ఎన్నికల్లో ఇదే ఫలితాలు రిపీట్ అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Read also : రెండేళ్లకే విసిగిపోయారు.. కెసిఆర్ అధికారంలోకి రావాలని కోరుతున్నారు : కేటీఆర్





