తెలంగాణ రాష్ట్రం సూర్యపేట జిల్లాలో ఒక బాధాకరమైనటువంటి వార్త ఒకటి అందరినీ కూడా కలిచి వేస్తుంది. సూర్యాపేట జిల్లాకు చెందినటువంటి ఒక యువతికి ఏకంగా ఎంబిబిఎస్ లోనే సీటు వచ్చిన ఆ యువతి కూలీ పనులకు వెళ్తుంది. ఇక అసలు విషయం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యపేట జిల్లా, తుంగతుర్తి మండలం, వెంపటికి చెందిన శివ గౌతమి అనే యువతి తాజాగా నీటిలో 507 మార్పులు సాధించిన ఆ యువతి కూలి పనులకు వెళ్తుంది. మూడేళ్ల వయసులోనే గౌతమీ తన తల్లిదండ్రులను కోల్పోయింది. అయితే నీట్ లో 507 మార్కులు సాధించి ఏకంగా మంచిర్యాల మెడికల్ కాలేజీలో సీటు సంపాదించారు.
మీ యూత్ కి పుస్తకాలు మరియు దుస్తులు అలాగే ఫీజులకు లక్ష యాభై వేలు ఖర్చు అవుతుందని కాలేజ్ యాజమాన్యాలు చెప్పారు. కానీ అంత డబ్బు ఈ యువతీ దగ్గర లేకపోవడంతో కూలి పనులకు వెళ్తుంది. సరస్వతి బిడ్డ అయినటువంటి ఈ గౌతమి అనే యువతకి పేదరికం చదువుకి అడ్డుపడింది. ప్రభుత్వ అధికారులు లేదా దాతలు ఎవరైనా ఉంటే ఆమెని ఆదుకోవాలని ఆమె బంధువులతోపాటు గ్రామం మొత్తం కోరుతున్నారు.