
క్రైమ్ మిర్రర్, రాజకీయ న్యూస్:- బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఎన్డీఏ పార్టీ మరింత బలంగా దూసుకుపోతుంది. ఈ మధ్య విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ప్రకారమే ఇక్కడ NDA పార్టీ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం NDA పార్టీకి మ్యాజిక్ ఫిగర్ కూడా దాటింది. NDA 155, MGB 65, JSP మూడు స్థానాల్లో ఆధిక్యంతో ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 122 ను కూడా ఎన్డీఏ పార్టీ దాటడంతో సేమ్ ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగానే ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా NDA పార్టీ నాయకులనుంచి నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే పాల్గొనడం ద్వారానే NDA పార్టీ కు నేడు ఇటువంటి ఫలితాలు వస్తున్నాయి. ఇక ప్రధాన పార్టీల వారీగా చూసుకుంటే BJP పార్టీ 78, JDU పార్టీ 65, RJD పార్టీ 59, కాంగ్రెస్ 11 సీట్ల ఆదిక్యంతో ముందుకు దూసుకుపోతున్నాయి. ఇక మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ ఫలితాలలో మూడు రౌండ్ల లో కలిపి కాంగ్రెస్ పార్టీ ఆదిత్యంలో ఉండడంతో ఆ పార్టీ నేతలు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇంకోవైపు మూడవ రౌండ్లో టిఆర్ఎస్ పార్టీ స్వల్ప ఆదిక్యంలో కొనసాగుతుంది.
Read also : CRIME: పట్టపగలే భార్య గొంతు కోసి చంపిన భర్త
Read also : మూడో రౌండ్లో తారు మారైన లెక్కలు.. ఆదిత్యంలోకి బీఆర్ఎస్?





