తెలంగాణ

నవాబ్ పేట్ ఠాణా సేవలు భేష్…మల్టీజోన్ -2 ఐజీపి- వి.సత్యనారాయణ

క్రైమ్ మిర్రర్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి: నవాబుపేట్ ఠాణా పోలీసుల సేవలు భేష్ అని మల్టీ జోన్-2 ఐజిపి సత్యనారాయణ అన్నారు.బుధవారం వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ పోలీస్‌స్టేషన్‌ను వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి,డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డితో కలిసి మల్టీజోన్-2 ఐజిపి సత్యనారాయణ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్‌ స్టేషన్‌ పరిసరాలు, క్వార్టర్స్‌ భవనం, రికార్డులను పరిశీలించారు.అనంతరం సిబ్బందితో మాట్లాడి సమస్యలు,కేసులకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఐజిపి సత్యనారాయణ మాట్లాడుతూ విధి నిర్వాహణలో ఉన్న ప్రతీ పోలీసు అధికారి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు రిజిస్టర్‌లో నమోదు చేసి ఫాలోఅప్‌ చేయాలని సూచించారు.

ప్రతీ ఫిర్యాదుదారుడికి సత్వర న్యాయం జరిగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పారు.డయల్‌ 100కు కాల్‌ చేసిన వెంటనే స్పందించి ఘటన స్థలానికి చేరుకోవాలని సూచించారు.మట్కా,జూద్యం, అక్రమ రవాణా, అసంఘిక కార్యకారపాలు నిరోధించే విషయంలో పోలీస్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.గత పది సంవత్సరాలతో పోలిస్తే నవాబుపేట ఠాణాలో క్రైమ్ రేట్ లేదన్నారు. చిన్న చిన్న భూ సమస్యలు, కుటుంబ సమస్యల ఫిర్యాదులు స్టేషన్కు వస్తున్నాయని వాటిని స్టేషన్ అధికారులు క్షుణ్ణంగా విచారణ చేసి పరిష్కరిస్తున్నారని చెప్పారు.పేకాట,రేవ్ పార్టీలు లాంటివి నవాబుపేట ఠాణా ప్రాంతంలో లేవని ఒకవేళ అలాంటివి జరిగితే పూర్తి బాధ్యత సిఐ, ఎస్సైలదేనని సూచించారు.

ఏదైనా పార్టీలు చేసుకోవాలంటే ముందస్తు అనుమతులు తప్పనిసరి అని తెలిపారు. ఈ ప్రాంతం పచ్చని పంట పొలాలతో ఆహ్లాదకరంగా ఉందని కితాబిచ్చారు. అంతకుముందు ఐజిపికి ఎస్పీ నారాయణరెడ్డి,డిఎస్పి శ్రీనివాస్ రెడ్డిలు సిబ్బంది గౌరవవందనం చేసి పువ్వుల బొకే ఇచ్చి ఆహ్వానించారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి నీళ్లు పోశారు.ఈ కార్యక్రమంలో సిఐ నవీన్ కుమార్,ఎస్సై అరుణ్ కుమార్, ఏఎస్సైలు మురళీధర్, యాదగిరి,సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button