
క్రైమ్ మిర్రర్,జాతీయ న్యూస్:- ఒకసారి ప్రకృతి విలయతాండవం చేస్తే అది ఎంత పెద్ద నష్టాన్ని తెచ్చిపెడుతుంది అనేది ఏ ఒక్కరు కూడా అంచనా వేయలేరు. మన భారతదేశంలో గత 30 ఏళ్లలోనే ఎన్నోసార్లు తుఫాన్ లంటూ, వరదలంటూ, వడదెబ్బలు అంటూ ఇలా 430 విపత్తులతో దేశవ్యాప్తంగా ఏకంగా 130 కోట్ల మంది ప్రభావితం అయ్యారు. భారతదేశంలో గడిచిన 30 సంవత్సరాలలోనే ప్రకృతి విపత్తుల కారణంగా 80,000 మంది మృతి చెందినట్లు జర్మన్ వాచ్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్(CRI) ఒక నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం చూసుకుంటే మిగతా అన్ని దేశాల్లో ఎలా ప్రాణ నష్టం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ నివేదిక ద్వారా గడిచిన 30 ఏళ్లలోనే ఇంతమంది మరణించడం అనేది తలుచుకుంటేనే ఏదోలా అనిపిస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి లక్షా 50 వేల కోట్ల నష్టం వాటిల్లినట్లుగా పేర్కొంది. ఈ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావితమైన దేశాల జాబితాలో భారత్ 9వ స్థానంలో నిలిచింది. డొమినికా దేశం మొదటి స్థానంలో నిలిచింది. ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో మొంథా తుఫాన్ కారణంగా ప్రాణ నష్టం ఎక్కువగా జరగకపోయినప్పటికీ ఆస్తి నష్టం మరియు పంట నష్టం బాగా వాటిల్లింది. ఇప్పటికే అధికారులు అందరూ కూడా పంట నష్టం పై ఒక నివేదికను తయారు చేస్తున్నారు. ఈ నివేదిక ప్రకారమే రైతులకు నష్టపరిహారం ఇవ్వనున్నారు.
Read also : నిన్న విజయ్ దేవరకొండ.. నేడు ప్రకాష్ రాజ్.. బెట్టింగ్ యాప్స్ కేసులో విచారణ?
Read also : ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఛీ ఛీ అనేవారు.. ఇప్పుడు భలే భలే అంటున్నారు : సీఎం చంద్రబాబు





