ఢిల్లీ, క్రైమ్ మిర్రర్ః : భారత దేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నేషనల్ క్వాంటం కంప్యూటింగ్ మిషన్ ప్రారంభించింది. ఈ మిషన్‌ను రూ.6,003.65కోట్లో ఆమోదించగా నేడు ప్రారంభమైంది. దీనిలో కంప్యూటర్‌ల వేగాన్ని పెంచడమే కాకుండా దేశ రక్షణ, సమాచార భద్రత, ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాంది పలకనుంది.
క్వాంటం కంప్యూటర్ల తయారీ…
క్వాంటం కంప్యూటింగ్ మిసన్ ఉద్దేశం క్వాంటం కంప్యూటర్ల తయారీ, రాబో ఎనిమిదేళ్లలో 2023 నుంచి 2031 మధ్య 50 నుంచి 1000 ఫిజికల్ క్యూబిడ్స్ సామర్థ్యం ఉన్న ఉన్న క్వాంటం కంప్యూటర్లను స్వదేశి పరిజ్ఞానంతో తయారు చేయడం దీని ఉద్దేశం. ఇప్పుడున్న సూపర్ కంప్యూటర్లు ఏళ్ల తరబడి చేసే లెక్కలను ఇవి సెకన్లలో పూర్తి చేస్తాయి.
సురక్షిత సమాచార వ్యవస్థ …
దేశ సరిహద్దుల లోపల 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరాల మధ్య అత్యంత సురక్షితమైన క్వాంటం కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయడం.శాటిలైట్ ద్వారా సురక్షితమైన సమాచారాన్ని పంపడం కోసం గ్రౌండ్ స్టేషన్ల మధ్య నెట్‌వర్క్‌ను నిర్మించడం. దీనివల్ల హ్యాకింగ్ చేయడం అసాధ్యం అవుతుంది. అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్, సెన్సార్లను తయారు చేయడం, ఇవి భూగర్భంలో ఉన్న ఖనిజాలను గుర్తించడానికకి, విమానయానంలో , రక్షణ రంగంలో నావిగేషన్ కోసం ఉపయోగపడతాయి.
థీమాటిక్ హబ్స్ (T-Hubs)….
మిషన్ భాగంగా దేశవ్యాప్తంగా నాలుగు ప్రధాన విభాగాల్లో పరిశోధనల కోసం ‘థీమాటిక్ హబ్స్’ ఏర్పాటు చేస్తారు, క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం కమ్యూనికేషన్, క్వాంటం సెన్సింగ్, మెట్రాలజీ, క్వాంటం మెటీరియల్స్, డివైసెస్ ఉంటాయి. కాగా ఈ మిషన్ వల్ల రక్షణ రంగంలో మిలిటరి సమాచాంర హ్యాక్ కాకుండా రహస్యంగా ఉంచవచ్చు, ఔషద రంగంలో కొత్త రకాల మందుల తయారీ, వాటి ఫార్ములాను విశ్లేశించడం చాలా వేగంగా జరుగుతుంది, సైబర్ దాడుల నుంచి పటిష్టమైన భద్రత లభిస్తుంది. వాతావరణశాఖ, భూకంపాలను ముందుగానే అంచనా వేయడానికి ఈ సాంకేతిక ఉపయోగపడుతుంది.
7వ స్థానంలో భారత్..
ప్రస్తుతం అమెరికా, చైనా, ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్ మరియు కెనడా వంటి దేశాల వద్ద మాత్రమే ఈ క్వాంటం సాంకేతికత ఉంది. ఈ మిషన్‌తో భారత్ కూడా టాప్-7 దేశాల జాబితాలో చేరింది. ఈ మిషన్ ద్వారా భారతదేశం సాఫ్ట్‌వేర్ రంగంలోనే కాకుండా, హార్డ్‌వేర్ మరియు అత్యాధునిక సైన్స్ రంగంలో కూడా ప్రపంచానికి దిశానిర్దేశం చేయబోతోంది.
