
నల్లగొండ నిఘా ప్రతినిధి(క్రైమ్ మిర్రర్):
కుక్కల దాడిలో ఇప్పటికే జింకలు మృత్యువాత పడిన సంఘటనలు నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలంలో చాలా మార్లు చోటు చేసుకుంది.. ఇవే కాకుండా కరెంట్ షాకులతో అడవి పందుల వేట తరచూ జరుగుతూనే ఉన్నాయి.. అడవి జంతువుల మాంసానికి మార్కెట్ లో డిమాండ్ ఎక్కువ కావడంతో, వేటగాళ్లకు డిమాండ్ పెరిగిందనే చెప్పుకోవాలి.. మర్రిగూడ మండలంలోని ఆయా గ్రామాల పంట పొలాలలో హైపవర్ కరెంట్ వైర్లకు కొండ్లు తగిలించి, బైండింగ్ వైరుతో పొలాల చుట్టూ కనపడకుండా వైరుతో అల్లి, మూగ జీవాల ఉసురు తీస్తున్నారు.
ఈ కారణంతో ఎన్నో సార్లు సబ్ స్టేషన్ ల నందు ట్రిప్ కావడంతో, కరెంట్ పోయిన సందర్భాలు చాలా ఉన్నాయని మండల ప్రజలు అనుకుంటున్నారు.. ఇలా చెప్పుకుంటూ పొతే ప్రతి చిన్న అడవి జంతువును సైతం వేటగాళ్లు వదలటం లేదని స్థానికులు అనుకుంటున్నారు.. బాంబులు పెట్టి అడవి జంతువుల దవడలు పగిలి చనిపోయే, వేషాలు వేటగాళ్లు వేస్తున్నారని, చనిపోయిన తరువాత వాటి చర్మాన్ని వలిచి సొమ్ము చేసుకుంటున్నారని ప్రజలు అంటున్నారు.
Also Read : జనజీవన స్రవంతి లోకి 22 మంది మావోయిస్టులు
మండల పరిధిలోని ఓ నిర్మానుష ప్రదేశం లో ఈకలు పీకి ఉన్న నెమలి కన్నులు మనసును కలిచి వేస్తుంది.. కనికరం లేని కఠిన హృదయులైన కసాయి వేటగాళ్లు, నెమలిని వేటాడి చంపి, ఈకలు పీకి కాల్చుకు తిన్నారని, హృదయం లేని ఆ మనుషుల మనసును చూస్తే కన్నీరు వస్తుంది.. అందంగా కురులు విప్పుకొని నాట్యం ఆడే ఆ నెమలి, కన్నులకు హాయిగా, మనసుకు ఆనందంగా కనపడుతుంది. కానీ వారికి ఆ నెమలి మాంసపు ముద్దలా కనపడి కూరాడి కుండలో కౌసుగా మారిందన్న అంశం మనసును కలచివేస్తుంది.
ఈ దృశ్యం ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యానికి నిలుటద్ధంలా కనపడుతుంది.. కన్నులు తెరిచి ఉన్న ఆ నెమలి ఈకలు చూపరులను బాధపడే పరిస్థితి తెచ్చింది.. అటవీ అధికారుల పర్యవేక్షణ లోపమే ఈ మూగ జీవాల హత్యకు..! నిదర్శనం అంటున్నారు మర్రిగూడ మండల వాసులు…
పూర్తి వివరాలు మరో క్రైమ్ మిర్రర్ సంచిక ద్వారా మీ ముందుకు…
నిఘా వ్యవస్థ నిద్రిస్తే క్రైమ్ మిర్రర్ కాపు కాస్తుంది..
ఇవి కూడా చదవండి ..
-
తెలంగాణలో ఫ్రూట్ జ్యూస్ తరహాలో టెట్రా ప్యాకెట్లలో మద్యం.
-
మర్రిగూడ ఎంపిడివో రాజకీయం..!రాజకీయంగా మారిన కరువు పని?
-
కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!
-
కోమటిరెడ్డిపై గుత్తా తిరుగుబాటు.. రెండుగా చీలిన నల్గొండ కాంగ్రెస్?
-
ఆస్తి కోసం కూతురును చంపి సవతి తల్లి.. నదిలో పాతి పెట్టిన వైనం!..