
క్రైమ్ మిర్రర్, కల్వకుర్తి:- జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు-2025 సంవత్సరానికి అర్హత గల ఉపాధ్యాయులు దరఖాస్తులు చేసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులుగా పనిచేస్తూ 10 సంవత్సరాల సర్వీసు పూర్తి అయిన ఆసక్తి గల ఉపాధ్యాయులు nationalawardstoteachers.education.gov.in వెబ్సైట్ ద్వారా ఈ నెల 13వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాల కోసం జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్ రావు 6302538858 నెంబర్ ను సంప్రదించొచ్చు లేదా వెబ్సైట్ ద్వారా చూసుకోవచ్చని, రిజిస్ట్రేషన్ చేసిన కాపీని డీఈఓ కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు.