
మిర్యాలగూడ క్రైమ్ మిర్రర్(నవంబర్ 21): జిల్లాలో ప్రమాదాల నియంత్రణ కోసం పలు కీలక చర్యలు చేపట్టాలని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ సూచించారు. నందిపాడు, ఈదులగూడ ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు, రంబుల్ స్ట్రిప్స్, లైటింగ్, వేగ నియంత్రణ సూచికలు ఏర్పాటు చేయాలని సంబంధిత విభాగాలకు ఆదేశించారు.
రాంగ్ రూట్ నియంత్రణకు నిరోధకాలు తప్పనిసరి చేయాలని తెలిపారు.గూడూరు వద్ద ప్రమాదాలు అధికంగా ఉండడంతో ప్రస్తుతం ఉన్న మీడియన్ ఓపెనింగ్‌ను మూసివేయాలని, మిర్యాలగూడ..వాడపల్లి మార్గాన్ని ఓపెన్ చేయాలని సూచించారు. పాదాచారుల భద్రత కోసం మెటల్ బీమ్ క్రాస్ బ్యారియర్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

దామరచర్ల ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీల ట్రాఫిక్ కారణంగా రద్దీ ఎక్కువగా ఉండడంతో సెంట్రల్ బ్యారియర్లు, లైటింగ్, రంబుల్ స్టిక్స్ ఏర్పాటు చేయాలని స్పెషల్ డైరెక్టివ్స్ జారీ చేశారు. అలాగే అన్ని ప్రధాన జంక్షన్ల వద్ద హై మాస్ట్ లైట్లు, జీబ్రా క్రాసింగ్, బ్లింకర్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని స్పష్టంచేశారు.
ఎస్పీ పవార్ మాట్లాడుతూ..జిల్లాలో బ్లాక్ స్పాట్లు 58 నుండి 41కి తగ్గాయి. రాత్రివేళ రహదారులపై వాహనాలు నిలిపితే ప్రమాదాలు పెరుగుతాయి. అందుకే నిరంతర పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాం. మిషన్ ఆర్ఆర్ఆర్ లో భాగంగా గ్రామాల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నాం అన్నారు.

శీతాకాల పొగమంచు..వాహనదారులకు ఎస్పీ ప్రత్యేక సూచనలు
ద్విచక్ర వాహనదారులు స్పష్టమైన గాజు ఉన్న హెల్మెట్ తప్పనిసరి అని లో బీమ్ వాడాలని చెప్పారు. వేగం తగ్గించి సురక్షిత దూరం పాటించాలి,రిఫ్లెక్టివ్ జాకెట్లు..టేపులు ఉపయోగించాలి అన్నారు.తడి రోడ్లపై సడన్ బ్రేక్ వద్దు టర్నింగ్‌కు ముందే ఇండికేటర్ ఇవ్వాలి, తెల్లవారుజాము, రాత్రి ప్రయాణాలు వీలైతే నివారించాలని, గ్లౌవ్స్ ధరించాలని తెలిపారు.
ఫోర్ వీలర్ డ్రైవర్లు
ఫాగ్ ల్యాంప్స్ లో బీమ్ వాడాలి,3..4 రెట్లు ఎక్కువ దూరం పాటించాలని, డిఫాగర్ వాడాలి..విండో కొంచెం ఓపెన్ చేయాలన్నారు.విజిబిలిటీ తగ్గితే హజార్డ్ లైట్లు ఆన్ చేయాలని,కర్వ్‌ల వద్ద ఓవర్‌టేక్ చేయవద్దు.. లైట్స్, బ్రేకులు, వైపర్లు చెక్ చేసుకోవాలని చేసుకోవాలి..సడన్ బ్రేకులు, వేగ మార్పులు వద్దు ఎస్పీ పవార్ అన్నారు.

పోగమంచు వల్ల విజిబిలిటీ తగ్గుతుంది. జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయి. ప్రజల భద్రతే మా లక్ష్యం” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ రాజశేఖర రాజు, సీఐలు పీ.యన్.డి. ప్రసాద్, నాగభూషణ్, ఎస్ఐలు రాంబాబు, శ్రీనివాస్, లక్ష్మయ్య, శ్రీకాంత్ రెడ్డి, మాజీ సీఐ అంజయ్య, రోడ్ సేఫ్టీ ఇంజనీర్లు పాల్గొన్నారు.





