
క్రైమ్ మిర్రర్, నల్లగొండ జిల్లా : నాగార్జునసాగర్ పరిధి విజయపురి టౌన్ పోలీస్ స్టేషన్‌లో విషాదం చోటుచేసుకుంది. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డు కిషన్ గుండెపోటుకు గురై మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే… కిషన్ ఉదయం తన ఇంటి వద్ద నుంచి విధి నిర్వహణకు బయలుదేరిన సమయంలో మార్గమధ్యంలో హఠాత్తుగా తీవ్ర గుండెనొప్పి రావడంతో అస్వస్థతకు లోనయ్యాడు. వెంటనే పరిస్థితిని గమనించి, తానే స్వయంగా స్థానిక కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రికి చేరుకున్నాడు. అక్కడ చికిత్స పొందుతూ కొద్ది సేపటికే ప్రాణాలు విడిచాడు.
ఈ ఘటనతో నాగార్జునసాగర్ పోలీస్ శాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సహచరులు, అధికారులు కిషన్ మృతిపై సంతాపం ప్రకటిస్తూ, కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు.