
మునుగోడు,క్రైమ్ మిర్రర్ :- నలగొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి జన్మదిన వేడుకలు జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ బోడ స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో జిల్లా డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత ముఖ్యఅతిథిగా హాజరైనారు. జిల్లా కేంద్రంలో మదర్ ధేరిస్సా నిర్మల్ హృదయ్ చారిటబుల్ ట్రస్ట్ నందు వృద్ధులకు కావలసిన నిత్యవసర వస్తువులు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం చారిటబుల్ సభ్యులు మానసిక వికలాంగులు మధ్య కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు పండ్ల పంపిణీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు పున్న కైలాష్ నేత మాట్లాడుతూ యువత రైతులకు మేధావులకు ఆదర్శంగా నిలిచిన ఎంపీ రఘువీర్ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని కొనియాడారు. రాజకీయాల్లో ప్రజలతో మమేకమై రాష్ట్ర రాజకీయాలను శాసించిన జానారెడ్డి రాజకీయ వారసుడుగా నేడు ప్రశంసలు అందుకుంటున్న రఘువీర్ రెడ్డి దేశంలో అత్యధికమైన మెజార్టీతో గెలుపొందారని అలాంటి నాయకుడి అడుగుజాడల్లో కాంగ్రెస్ నడుస్తుందని అన్నారు. అదేవిధంగా పున్న కైలాష్ నేత ఆధ్వర్యంలో అయాన్ష్ భార్గవ్ ట్రస్ట్ వారు నార్కెట్పల్లి చెరువుగట్టు దేవస్థానం నందు భక్తులకు అన్నదాన ప్రసాదం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు,వివిధ నియోజకవర్గాల నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Read also : రామకృష్ణాపూర్ బీఎస్పీ పట్టణ అధ్యక్షుడిగా బొల్లి నరేష్ ఎన్నిక
Read also : క్యాతనపల్లి మున్సిపాలిటీ డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల





