
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- బీహార్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా NDA కు సపోర్ట్ గా నిర్ణయాన్ని ప్రకటించాయి. ఈసారి కూడా బీహార్ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి గెలుస్తుంది అని అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా పేర్కొన్నాయి. అయితే ఈ తరుణంలోనే RJD పార్టీ చీఫ్ తేజస్వి యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ ఎన్నికల్లో తమదే గెలుపు అని.. ఇందులో ఎలాంటి అనుమానాలు కూడా అవసరం లేదు అని ధీమా వ్యక్తం చేశారు. కేవలం కొంతమంది అధికారులు ఒత్తిడితోనే గౌడి మీడియా తప్పుడు ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించింది అని తీవ్రంగా ఆరోపిస్తూ మండిపడ్డారు. ఈసారి బీహార్ ఎన్నికల్లో నేనే గెలుస్తాను.. నవంబర్ 14వ తేదీన మహాఘాట్బంధన్ (MGB) కు అనుకూలంగా ఫలితాలు రాబోతున్నాయని వెల్లడించారు. ఇక 18వ తేదీన ప్రమాణ స్వీకారం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా హాజరుకావాలని.. పక్కా గెలుపు మనదే అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. ఇన్నాళ్లుగా ఎన్డీఏ పాలనలో ప్రజలు పూర్తిగా విసిగిపోయారు అని.. ఈసారి మా ప్రభుత్వానికి అండగా నిలుస్తూ ఎన్డీఏ కు వ్యతిరేకంగా ఓటు వేశారు అని మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఈసారి కూడా విజయం మాదే అంటూ ఎన్డీఏ నాయకులు చెబుతున్నారు. కాగా నవంబర్ 14వ తేదీన బీహార్ ఎన్నికల ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఓటు వేయడానికి వెళ్లిన బిహారీ వ్యక్తులందరూ కూడా మళ్లీ తిరిగి ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. మరి బీహార్ లో ఏ పార్టీ విజయం సాధించబోతుందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
Read also : RCB అభిమానులకు షాకింగ్ న్యూస్.. స్టేడియం చేంజ్?
Read also : రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న వైసీపీ?





