
క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్ :-
ప్రతిసారి కూడా కొత్తరకం వస్తువులను కనిపెట్టి తీసుకువచ్చి ప్రపంచానికే పరిచయం చేసే ఎలాన్ మస్క్ ఈసారి హ్యూమనాయిడ్ అనే రోబో ఆప్టిమస్ ను పరిచయం చేశారు. ఈ రోబో మన ప్రపంచానికే అత్యద్భుతమైన వైద్య సేవలను అందించగలదు అని టెస్లా CEO ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. మన ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ వృత్తిలో సంచలనం సృష్టించిన మనుషులు కూడా చేయలేని కొన్ని కఠినమైన శస్త్ర చికిత్సలను ఈ హ్యూమనాయిడ్ రోబో చేయగలదు అని అన్నారు. మన ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే గొప్ప గొప్ప వైద్యులు, ఎంతో అనుభవం ఉన్నటువంటి వైద్యులు తక్కువ మంది మాత్రమే ఉన్నారు అని అన్నారు. ఈ డాక్టర్ లందరూ కూడా ఎవరూ చెట్లకు కాయలేదు. కానీ ఇప్పుడు వీరందరూ ఫ్యాక్టరీల్లో తయారు చేయొచ్చు అని ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. సూపర్ హ్యూమన్ తరహా కచ్చితత్వం కలిగిన ఆప్టిమస్ సర్జరీలు కూడా ఇది చేయగలదు అని అన్నారు. కాగా ప్రస్తుత కాలంలో మనుషులు చేస్తున్నటువంటి ప్రతి పని కూడా రోబో చేస్తుంది . అంతేకాకుండా మనుషులు కన్నా వేగంగా.. అతి తక్కువ ఖర్చు అలాగే అతి వేగంతో పనులను పూర్తి చేయడంతో ప్రతి ఒక్క కంపెనీ కూడా కొత్తగా రోబోలను తీసుకురావడంతో చాలామంది యువత కూడా ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుంది. ఇటువంటి తరుణంలోనే తాజాగా ఎలాన్ మస్క్ కూడా ప్రపంచంలోనే ఉన్నటువంటి డాక్టర్ల కన్నా వేగంగా అలాగే కఠినమైన శాస్త్ర చికిత్సలను కూడా ఈ రోబో చేయగలదు అని కొత్తగా హ్యూమనాయిడ్ రోబో ఆప్టిమస్ ను పరిచయం చేశారు. భవిష్యత్తులో వైద్య వృత్తిలో ఇలాంటి రోబోలు మరికొన్ని వస్తే వైద్య వృత్తిలో ఉన్నటువంటి ఎంతో మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుంది.
Read also : I BOMMA నిర్వాహకుడు అరెస్ట్.. మూడు కోట్లు స్వాధీనం!
Read also : కాంగ్రెస్ కు జై కొట్టిన టీడీపీ… అందుకే నవీన్ ఘన విజయం!





