
పట్టుమని 15ఏళ్లు కూడా లేవు. తల్లిదండ్రులు చాటున పెరిగాల్సిన బాలుడు. అతి కిరాతకుడిలా ప్రవర్తించాడు. ఒక బాలికను అంత్యంత కిరాతకంగా హత్య చేశాడు. చచ్చిపోయేవరకు ఆమెను పొడుస్తూనే ఉన్నాడు. పదో తరగతి పిల్లాడు…. ఇంత ఘోరం చేశాడంటే… అసలు సమాజం ఎటు పోతోంది. భావితరం ఆలోచన ఏ స్థాయికి పడిపోతోంది. అసలు హత్య చేయాలన్న ఆలోచన… ఆ వయస్సు పిల్లాడికి ఎలా వచ్చింది. హత్య చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో… కనీసం అవగాహనైనా ఉంటుందా..? ఎందుకింత ఘోరం చేశాడు. అసలు ఏం జరిగింది…?
హైదరాబాద్ కూకట్‌పల్లిలో 8వ తరగతి విద్యార్థిని సహస్ర హత్య కేసును పోలీసులు ఛేదించింది. పక్కింట్లో ఉంటున్న పదో తరగతి విద్యార్థే హంతకుడని నిర్థారించారు. ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు వాడిన కత్తి… రక్తం అంటిన దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. పదో తరగతి బాలుడేంటి…? చంపడమేంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. దొంగతనం చేస్తుండగా చూసిందని బాలికను అత్యంత దారుణంగా హత్య చేశాడు పదో తరగతి విద్యార్థి. ఎంత పైశాచికమో కదా.
తల్లిదండ్రులు విధులకు వెళ్లిన సమయంలో సహస్క ఇంట్లో ఒక్కటే ఉంది. ఆ సమయంలో ఆ చిన్నారి హత్యకు గురైంది. మధ్యాహ్నం లంచ్ సమయానికి ఇంటికి వచ్చి చూసిన తండ్రి.. రక్తపుమడుగులో ఉన్న కూతుర్ని చూసి విలవిల్లాడాడు. ఆ తల్లిదండ్రులు కడుపుకోత వర్ణణాతీతం. పోలీసులు విచారణ చేపట్టారు… క్లూస్ లేకపోవడంతో దర్యాప్తు కష్టంగా మారింది. బయటి వ్యక్తులు ఎవరూ ఇంట్లోకి రాలేదని సీసీ ఫుటేజ్‌ల ద్వారా తేలింది. మరి బాలికను ఎవరు హత్య చేసుకుంటారు.. బాలిక తల్లిదండ్రులు ఉంటున్న భవనంలోని వారే కావొచ్చని అనుమానించారు. ఒక వ్యక్తిపై అనుమానంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతను కాదని తెలిసి వదిలేశారు. ఆ ఏరియాలో ఉంటున్న ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఇచ్చిన సమాచారం హంతకుడిని పట్టించింది.
బాలిక సహస్ర ఇంటికి దగ్గరలో ఉంటున్నాడు పదో తరగతి బాలుడు. సహస్ర ఇంట్లోని దేవుడి గదిలో ఉన్న హుండీపై కన్నేశాడు. హుండీని కాజేద్దామని… ఇంట్లో పెద్దవా్లు ఎవరూ సమయం చూసుకుని దూరాడు. కానీ సహస్రకు దొరికిపోయాడు. దొంగతనం విషయం… బయటపెడతానని… వాళ్ల తల్లిదండ్రులకు చెప్తానని బాలిక బెదిరించిందట. దీంతో… ఏం చేయాలో తెలియక బాలికను చంపేశాడు ఆ బాలుడు. వెంట తెచ్చుకున్న కత్తితో.. అత్యంత దారుణంగా పొడిచేశాడు. సమస్ర చనిపోయే వరకు పలుమార్లు పొడిచారు. ఆ తర్వాత ఆపై కూర్చుని గొంతునులిమాడు. బాలిక చనిపోయిందని నిర్ధారించుకుని.. గోడ దూకి పక్కింట్లోకి వెళ్లిపోయాడు. అక్కడ 15 నిమిషాల పాటు దాక్కున్నాడు. ఆ విషయం… అక్కడ ఉంటే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి చూశాడు. అప్పుడు… ఏదోలే అనుకుని ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత సహస్ర హత్య వార్త తెలిసి… బాలుడి విషయం గుర్తుకొచ్చింది. దీంతో.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆ సమాచారం ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు… ఈ కేసులో చిక్కుముడులను విప్పారు. బాలుడి ఇంటికి వెళ్లి సోదాలు చేశారు. స్కూల్‌కి వెళ్లి అతని స్నేహితులతో మాట్లాడారు. బాలుడి ఇంట్లో హత్యకు వాడిన కత్తితోపాటు.. రక్తపు మరకలున్న దుస్తుల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. పదో తరగతి పిల్లాడు.. ఇంత దారుణం చేశారని ఆ ప్రాంతంలోని వారికే కాదు.. వినే వారికి కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది.
పిల్లల ఆలోచనలను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. వారి తీరు… ఏం చేస్తున్నారు..? ఎక్కడికి వెళ్తున్నారు..? వారి అలవాట్లు ఏంటి..? ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారు…? వాళ్ల మైండ్‌సెట్ ఉంది…? అన్నవి పరిశీలించుకోవాలి. దారి తప్పుతున్నారని అనుమానం వస్తే.. మంచి మాటలతో దారిలో పెట్టుకోవాలి. లేదంటే… ఇలాంటి దారుణాలే జరుగుతాయి. సో.. పేరంట్స్.. బీ కేర్ ఫుల్.