క్రైమ్ మిర్రర్, మునుగోడు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ ఆధ్వర్యంలో జనవరి మాసమంతా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్న సందర్భంగా మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో రోడ్డు భద్రతపై అవగాహన బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈసందర్భంగా మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి తన మాతృమూర్తి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా పోలీస్ శాఖ, స్థానిక నాయకులతో కలిసి వాహనదారులకు 300 హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేశారు. మునుగోడులోని తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయం నుండి హెల్మెట్ ధరించి మునుగోడు పట్టణ కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు.
మునుగోడు పట్టణంలో హెల్మెంట్ లేకుండా ప్రయాణం చేస్తున్న వాహనదారులను ఆపి తానే స్వయంగా హెలిమెంట్ తొడిగారు. ప్రమాదాల బారిన పడి యువకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేద వ్యక్తం చేశారు. ఉపాధి నిమిత్తం మునుగోడు పట్టణం నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లే సందర్భంలో చాలా జాగ్రత్తగా ప్రయాణం సాగేలా హెల్మెట్ ధరించాలని ప్రతి ఒక్క వాహనదారున్ని కోరారు. రాబోయే రోజుల్లో రోడ్డు భద్రతపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమం చేపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మునుగోడు పట్టణ పోలీస్ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
- హైడ్రా కీలక నిర్ణయం.. ఇకపై హైడ్రా గ్రీవెన్స్, వారం రోజుల్లో హైడ్రా పోలీస్‌స్టేషన్!!
- రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల వేలానికి సర్కార్ కసరత్తు.. దశల వారీగా విక్రయానికి నిర్ణయం!!
- ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో పేలిన రియాక్టర్.. ఒకరు మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు
- బాయ్స్ హాస్టల్‌లో దారుణ ఘటన.. ప్రియురాలి కోసం యువకుని దారుణహత్య!!
- అల్లు అర్జున్ కి గుడ్ న్యూస్!.. కానీ దేశం వదిలి వెళితే కఠిన చర్యలు?