
చండూరు,క్రైమ్ మిర్రర్:- ఓ వైపు మున్సిపల్ తుది జాబితా సిద్ధమవుతుండగా మరోవైపు అందరి చూపు రిజర్వేషన్ల పైనే ఉంది. గత రిజర్వేషన్లను కొనసాగిస్తారా లేక రిజర్వేషన్లలో మార్పు జరుగుతుందా అనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. నిజానికి ఒకసారి చేసిన రిజర్వేషన్లు రెండు పర్యాయాలు అమలు చేయాల్సిందిగా చట్టం చేశారు. ఆ చట్టాన్ని మారుస్తూ ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ ఆ చట్టాన్ని మారిస్తే అన్ని మున్సిపాలిటీలో రిజర్వేషన్ల మార్పు జరుగుతుంది. చట్టం మార్పు చేయకపోతే మాత్రం గతసారి రిజర్వేషన్లు ఇప్పుడు అమలు చేయాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీల చైర్మన్ ల రిజర్వేషన్ల మార్పు మాత్రం అనివార్యంగా మారింది. మొత్తం ఓటర్ల సంఖ్యలో ఆయా కులాల వారి ఓటర్ల సంఖ్యను బట్టి రిజర్వేషన్ల సంఖ్య ను కేటాయిస్తారు. మొత్తం రిలేషన్లు కలిపి 50% మించకూడదు. చండూరు మున్సిపాలిటీ కి సంబంధించి మొత్తం 10 వార్డులు ఉండగా ఒక ఎస్సి ఒక ఎస్టి స్థానాన్ని కేటాయించాల్సి ఉంటుంది. వీరి ఓటర్ల సంఖ్యను పరిశీలిస్తే 4,2 వార్డులలో ఏదో ఒక వార్డు ఎస్సీ అయ్యే అవకాశం ఉంది. 5,6 వాటిల్లో ఏదో ఒకటి ఎస్టీ రిజర్వు అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన వార్డుల్లో తీసుకుంటే గతంలో మహిళా స్థానాల్లో జనరల్ లేదా బీసీ జనరల్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే జనరల్ లేదా బీసీ జనరల్ ఉన్న స్థానాలను ఇపుడు మహిళలకు కేటాయిస్తారు. ఇక చైర్మన్ స్థానాన్ని పరిశీలిస్తే బీసీ జనరల్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి.
Read also : తమిళనాడులోను మన ప్రభుత్వమే వస్తుంది.. ధీమా వ్యక్తం చేసిన అమిత్ షా
Read also : ఫోన్ ట్యాపింగ్: హరీశ్‌రావుకు సుప్రీంకోర్టులో ఊరట..!





