
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ప్రస్తుత రోజుల్లో కొన్ని అనుకోని సంఘటనల కారణంగా ఎంతో మంది మృతి చెందుతూ ఉన్నారు. కొంతమంది చేసిన తప్పిదాలకు మరి కొంతమంది బలైపోతున్నారు. ఇక తాజాగా ఒక 26 రోజుల చిన్నారి తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగా మరణించింది. తల్లిదండ్రులు నిద్రలో అనుకోకుండా ఒరగడంతో ఊపిరాడక పాపం చిన్నారి మృతిచెందిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్అవుతుంది. ఇక అసలు వివరాల్లోకి వెళితే.. యూపీ కి చెందిన తల్లిదండ్రులు తాజాగా వారికి జన్మించిన 26 రోజుల బిడ్డను ఎప్పటిలాగే తమ మంచం పై మధ్యలో పడుకోబెట్టుకొని నిద్రపోయారు. అయితే అర్ధరాత్రి సమయంలో ఇద్దరు అనుకోకుండా ఒక్కసారిగా ఆ చిన్నారిపై ఒరిగారు. చిన్నారికి ఏమి అయ్యుండదులే అని ఇక ఆ వెంటనే మళ్ళీ తిరిగి పక్కకు పడుకున్నారు. కానీ ఉదయం ఆ చిన్నారికి తల్లి పాలు పట్టేందుకు ప్రయత్నించగా.. స్పందించకపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇక అక్కడి డాక్టర్లు ఆ చిన్నారిని పరిశీలించి అప్పటికే శ్వాస ఆడక చనిపోయింది అని తెలిపారు. దీంతో ఆ తల్లిదండ్రులు అక్కడికక్కడే కన్నీరు పర్యంతమయ్యారు. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చిన్నారుల విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి అని.. లేదంటే ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతాయి అని అంటున్నారు.
Read also : ప్రజల్లోకి వెళ్ళండి.. దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు మోడీ సూచన
Read also : Vastu Precautions: వామ్మొ!.. ఆ రోజు తులసి మొక్కను ముట్టుకుంటే దరిద్రులవడం ఖాయమట!





