
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :– తెలంగాణ రాష్ట్రంలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గాజుల రామారం అనే గ్రామంలో విషాదం నెలకొంది. కన్న కొడుకుల అనే కొబ్బరి బోండాల కత్తితో నరికి చంపిన తల్లి… తర్వాత ఆమె కూడా సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఇక అసలు వివరాలు కి వెళ్తే,.. తేజస్విని అనే మహిళకు హర్షిత్ మరియు ఆశిష్ రెడ్డి అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే తేజస్వినికి చిన్నప్పటినుంచి కళ్ళ సమస్య. అదే సమస్య వాళ్ళిద్దరు పిల్లలకి కూడా రావడం జరిగింది. ఆమె ప్రతి నాలుగు గంటలకు ఒకసారి కళ్ళల్లో డ్రాప్స్ వేస్తే కానీ సరిగా కనపడవు. ఈ సమస్యతో దాదాపు ఇప్పటివరకు కూడా పోరాడుతూనే ఉంది. కానీ ఇదే ఇప్పుడు సమస్యగా మారిపోయింది. తేజస్విని ఈ సమస్యతో బాధపడుతున్న ప్రతి సందర్భంలోనూ తన భర్తతో ఇంట్లో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇదే సమయంలో భర్త కూడా కోపంతో చాలాసార్లు చస్తే చావండి అని బార్య తేజస్విని అనడంతో ఆమె వెంటనే పిల్లలను చంపి తను కూడా సూసైడ్ చేసుకుంటున్నట్లు ఒక ఆరు పేజీ ల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది తేజస్విని. ఈ ఘటన పోలీసులకు తెలియడంతో వెంటనే విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.