
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 బెనిఫిట్ షోలో ఘోరం జరిగింది. అభిమానుల మధ్య తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోగా.. ఆమె కొడుకు, కూతురు తీవ్రంగా గాయపడ్డారు. హాస్పటిల్ లో ప్రాణాలతో పోరాడుతున్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియోటర్ దగ్గర ఈ విషాదం చోటు చేసుకుంది.
సంధ్య థియేటర్ లో పుష్ప-2 సినిమాను చూసేందుకు హీరో అల్లు అర్జున్ రావడంతో ఒక్కసారిగా వేలాది మంది ఎగబడ్డారు. ప్రీమియర్ షో టికెట్లు ఉన్నవారిని లోపలికి పంపాలన్న ఉద్దేశంతో గేట్లు తెరిచారు. ఈ సందర్భంగా తీవ్రమైన తొక్కిసలాట, తోపులాట జరిగాయి. టికెట్లు ఉన్నవాళ్లు, లేనివాళ్లూ అందరూ థియేటర్ లోపలికి దూసుకొచ్చారు. ఈ సమయంలో పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేసి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపల ఓ పది మంది కిందపడిపోయారు.
ఫ్యాన్స్ ఒక్కసారిగా ముందుకు తోసుకుంటూ రావడంతో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే 39 ఏళ్ల మహిళ మృతి చెందింది. ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు శ్రీతేజ్, ఏడేళ్ల కూతురు కిందపడిపోయారు. జనం కాళ్ల మధ్య నలిగిపోయారు. తీవ్ర గాయాలతో తల్లి, కొడుకు స్పృహ తప్పారు. వెంటనే పోలీసులు వారిని పక్కకు తీసుకెళ్లి సీపీఆర్ చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రేవతి మృతి చెందింది. పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీతేజ్ ను పోలీసులు నిమ్స్ కు తరలించారు.
దిల్ సుఖ్ నగర్ లో తన భర్త, కొడుకు, కూతురుతో ఉంటున్న రేవతి.. పుష్ప 2 కోసం ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ కు వచ్చారు. కొన్ని నిమిషాల్లో సినిమా హాల్ లోకి వెళ్తామనగా జరిగిన తొక్కిసలాట ఆమె ప్రాణం తీసింది. ఆమె కుమారుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. తొక్కిసలాటలో మరో పది మంది వరకు గాయపడ్డారు. చిక్కడపల్లి పోలీసులు దీనిపై కేసు రిజిస్టర్ చేశారు.
మరిన్ని వార్తలు చదవండి…
కిలాడి లేడి వలపు వలకు.. బలైన ఎస్సై హరీష్..!
భూకంపం దెబ్బకి ఊగిపోయిన సమ్మక్క, సారక్క ఆలయం!
కోమటిరెడ్డి ఎఫెక్ట్.. రీజనల్ రింగ్ రోడ్డుకు అటవీ అనుమతులు
తెలుగు రాష్ట్రాల్లో భూకంపం.. భయంతో పరుగులు పెట్టిన జనం
బన్నీ కోసం రంగంలోకి పవన్.. సంబరాల్లో మెగా ఫ్యాన్స్
జీ న్యూస్ రిపోర్టర్‌పై జనసేన ఎమ్మెల్యే హత్యాయత్నం!.. పవన్ సీరియస్
అల్లు అర్జున్ పై సెటైరికల్ ట్వీట్ చేసిన ఆంధ్ర ఎంపీ?… అసలు ఏమైందో తెలుసా?
కుండపోత వానలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు
డిసెంబర్ 3న టీడీపీలోకి తీగల.. ఆయనతోనే ఆకుల అర్వింద్ కుమార్
జనవరిలో సర్పంచ్ ఎన్నికలు.. ముగ్గురు పిల్లల్లున్నా పోటీ చేయొచ్చు
నాగబాబుకి కీలక పదవి…ఢిల్లీ వెళ్ళిన పవన్ కళ్యాణ్?
అయ్యప్ప స్వాములకు బ్రీత్ అనలైజర్ టెస్ట్.. ఆర్టీసీలో దుమారం
ఫుడ్ పాయిజన్‌తో 38 మంది విద్యార్థులు మృతి.. తెలంగాణలో ఘోరం
కోటి 10 లక్షల ఇండ్లలో సమగ్ర సర్వే పూర్తి
సీఎం రేవంత్ జిల్లా మరో దారుణం.. పిల్లల సాంబారు,చట్నీలో బొద్దింక
అయ్యప్ప మాలలో కడప దర్గాకు రాంచరణ్
కుర్ కూరే తినడం వల్లే పిల్లలకు అస్వస్థత.. హైకోర్టుకు సర్కార్ రిపోర్ట్