
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- మరో తొమ్మిది రోజులలో 2025 సంవత్సరానికి ప్రతి ఒక్కరు స్వస్తి పలుకుతారు. ఇక న్యూ ఇయర్ సెలబ్రేషన్ తో కొత్త ఏడాది
ప్రారంభమవుతుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తో పాటుగా ప్రతి ఒక్కరికి జనవరి నెలలో సెలవుల పేరుతో మరింత సెలబ్రేషన్స్ చేసుకోనున్నారు. జనవరి 1 వ తేదీన గురువారం రోజు కొత్త సంవత్సరం మొదటి రోజు కాబట్టి ప్రభుత్వ సెలవు దినం ఉంటుంది. ఇక జనవరి 2 శుక్రవారం రోజున సెలవు పెడితే శనివారం మరియు ఆదివారాలతో కలిపి వరుసగా నాలుగు రోజులు హాలిడేస్ తో ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయవచ్చు. అలాగే జనవరి 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు వరుసగా నాలుగు రోజులు సెలవులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే జనవరి 23వ తేదీన శుక్రవారం రోజు వసంత పంచమి కాబట్టి అధికారికంగా కొంతమందికి సెలవు ఉంటుంది. ఇక 24 శనివారం, 25 ఆదివారం. ఇక 26వ తేదీ సోమవారం రోజున గణతంత్ర దినోత్సవం కాబట్టి హాలిడే ఉంటుంది. కాబట్టి సంక్రాంతి సెలవులు మాత్రమే కాకుండా మరో ఎనిమిది రోజులు లాంగ్ హాలిడేస్ వచ్చాయి. దీంతో నెల మొత్తంలో దాదాపు సగం పైగా అంటే 15 రోజులు పాటు దాదాపు సెలవులు ఉండనున్నాయి. కాబట్టి ముందస్తుగా ప్లాన్ చేసుకొని ఎక్కడికైనా దూరంగా ట్రిప్ కి వెళ్లడానికి కూడా ఇది సరైన అవకాశం. లేదంటే హాయిగా సెలవులు పెట్టుకొని ఇంట్లోనే రెస్ట్ తీసుకోవచ్చు.
Read also : *ప్రజాసేవే నా ప్రధాన ధ్యేయంగా పని చేస్తా – దామెర్ల అశోక్*
Read also : పవన్ వ్యాఖ్యలకు భయపడేవారు ఎవరూ లేరు ఇక్కడ : పేర్ని నాని





