మద్య ప్రాచ్యంలో కొనసాగుతున్న గగన తల ఆంక్షలు
తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణీకులు
క్రైమ్ మిర్రర్, న్యూఢిల్లీ: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్నయుద్దం కారణంగా ఇప్పుడు భారతీయ ప్రయాణీకులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతున్నాయి. మార్చి 1వ తేదీ ఆదివారం నాడు, భారతీయ విమానయాన సంస్థలకు చెందిన 350 కి పైగా విమానాలు రద్దు అయ్యాయి.
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ) తాజా డేటా ప్రకారం, మధ్యప్రాచ్య గగనతలంలో విధించిన ఆంక్షల కారణంగా విమానయాన రంగంలో ఈ పెద్ద అంతరాయం ఏర్పడింది. ప్రారంభంలో 444 విమానాలు రద్దు అవుతాయని భావించినప్పటికీ, ఈ సంఖ్య 350కి పరిమితం కావడం ఉపశమనం కలిగించింది.ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 100 విమానాలు నిలిచిపోగా, ముంబై విమానాశ్రయంలో 125 విమానాలు రద్దు అయ్యాయి.
తాజా ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, భారతదేశంలోని అన్ని ప్రధాన విమానాశ్రయాలను అప్రమత్తంగా ఉంచారు. ప్రయాణీకుల రద్దీని నియంత్రించడానికి, అవసరమైన సహాయం అందించడానికి, ఏదైనా ఊహించని మళ్లింపులను సజావుగా నిర్వహించడానికి విమానాశ్రయాలలో సీనియర్ అధికారులను నియమించారు.ఈ సంక్షోభం దేశీయ మార్గాలకే పరిమితం కాలేదు.
టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా ఆదివారం 22 అదనపు అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసింది. దీంతో, మధ్యప్రాచ్య సంక్షోభం కారణంగా ఎయిర్ ఇండియా రద్దు చేసిన మొత్తం అంతర్జాతీయ విమానాల సంఖ్య ఇప్పుడు 50కి చేరుకుంది. మధ్యప్రాచ్య గగనతలాన్ని ఉపయోగించి ఎంపిక చేసిన అంతర్జాతీయ విమానాల సస్పెన్షన్‌ను ఎయిర్‌లైన్ నేటి వరకు పొడిగించింది.పరిస్థితిని జాగ్రత్తగా అంచనా వేసిన తర్వాత ఈ ముందు జాగ్రత్త చర్య తీసుకున్నట్లు ఎయిర్‌లైన్ యాజమాన్యం తెలిపింది.
రీఫండ్ – రీషెడ్యూల్ కోసం నియమాలు ఏమిటి…?
ముందస్తుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న, అత్యవసర ప్రయాణాలు చేస్తున్నవారు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే, ఈ క్లిష్ట సమయంలో ఆర్థిక నష్టం నుండి కస్టమర్లను రక్షించడానికి విమానయాన సంస్థలు ప్రయత్నించాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా రెండూ మధ్యప్రాచ్యానికి, అక్కడి నుండి ప్రయాణించేవారికి అదనపు ఖర్చు లేకుండా టిక్కెట్లను రీషెడ్యూల్ చేయడం లేదా పూర్తి వాపసు పొందే అవకాశాన్ని ప్రకటించాయి.
మార్చి 7 వరకు ప్రయాణానికి ఫిబ్రవరి 28న లేదా అంతకు ముందు బుక్ చేసుకున్న టిక్కెట్లకు పూర్తి మినహాయింపు వర్తిస్తుందని ఇండిగో స్పష్టం చేసింది. మరోవైపు, ఎయిర్ ఇండియా ఫిబ్రవరి 28 వరకు చేసిన బుకింగ్‌లకు (మార్చి 5 వరకు షెడ్యూల్ చేసిన ప్రయాణానికి) అదే ప్రయోజనాన్ని పొడిగించింది.
