
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో నేడు రాష్ట్రంలోని పలు జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు స్పష్టం చేశారు. ప్రకాశం, నెల్లూరు మరియు తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. ఇక మరోవైపు అనంతపురం, శ్రీ సత్య సాయి, అన్నమయ్య, కడప మరియు చిత్తూరు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు దంచి కొడతాయని వాతావరణ శాఖ అధికారులు కీలక ప్రకటన చేశారు. ఇక దక్షిణ కోస్తాంధ్ర తీరం వెంబడి ఏకంగా 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అధికారులు అంచనా వేశారు. కాబట్టి పనుల నిమిత్తం బయటకు వెళ్లేవారు అత్యవసరమైతే తప్ప వెళ్ళవద్దని అధికారులు సూచనలు చేస్తున్నారు. మరోవైపు ఈ నెల చివరి ఆఖరి వారంలోపు వర్షాలు తగ్గుముఖం పడతాయని… అప్పటివరకు ఎటువంటి దూరపు ప్రయాణాలు చేసుకోకపోవడం మంచిదని సూచించారు. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు అలాగే తిరుపతి జిల్లాల ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. వర్షం పడుతున్న సమయంలో కరెంట్ స్తంభాల వద్ద, చెట్ల క్రింద నిలబడవద్దని హెచ్చరించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా పలు జిల్లాలలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ వర్షాలపై అధికారులు కూడా ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితుల పై అవగాహన చేస్తూనే ఉన్నారు.
Read also : ఆ పని చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళండి : బీఆర్ఎస్ సీనియర్ నేత
Read also : నటులలో దేవుడు మహేష్ బాబే.. 5000 కు చేరిన ఉచిత గుండె ఆపరేషన్లు