
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు కు భారీ షాక్ తగిలింది. తిరుపతిలో సినీ నటుడు మోహన్ బాబుకు ఉన్నటువంటి యూనివర్సిటీలో గత మూడు సంవత్సరాల నుంచి ఈ యూనివర్సిటీ కాలేజీల విద్యార్థుల నుంచి వివిధ ఫీజులు కారణంగా అదనంగా 26 కోట్ల రూపాయలు వరకు వసూలు చేసినట్లుగా ఉన్నత విద్యా కమిషన్ వెల్లడించింది. ఈ విషయంపై యూనివర్సిటీ యాజమాన్యం అలాగే మోహన్ బాబుపై ఉన్నత విద్యా కమిషన్ తీవ్రంగా మండిపడింది. 15 రోజుల్లోపు విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసినటువంటి 26 కోట్లను వెంటనే తిరిగి చెల్లించాలని ఆదేశాలను జారీ చేసింది. అంతేకాకుండా విచారణ అనంతరం 15 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. దీంతో మోహన్ బాబు యూనివర్సిటీకి గట్టి షాక్ తగిలిందనే చెప్పాలి. యూనివర్సిటీ లైసెన్సును రద్దు చేయాలని ప్రభుత్వానికి ఇప్పటికే ఉన్నత విద్యా కమిషన్ సిఫారసు కూడా చేసింది. దీంతో తర్వాత ఏం జరగబోతుందో అనేది ఒకవైపు యూనివర్సిటీ విద్యార్థులకు మరోవైపు మోహన్ బాబుకు కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. 15 రోజుల్లోగా ఈ 26 కోట్లు తిరిగి చెల్లించకపోతే కఠిన చర్యలు ఉంటాయని కూడా ఉన్నత విద్య కమిషన్ హెచ్చరించింది. మరి ఈ 15 రోజుల్లోపు మోహన్ బాబు ఆ 26 కోట్లను తిరిగి చెల్లిస్తారా లేదా అనేది ఉత్కంఠంగా మారింది. కాగా ఈ సినీ నటుడు మోహన్ బాబు కు కొన్నిచోట్ల కాలేజీలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే.
Read also : ప్రకాశం జిల్లాలో ఘరానా మోసం… కోటి రూపాయలు స్వాహా!
Read also : గెలవడం కోసం ఉచిత పథకాలు ప్రకటించొద్దు.. దీనివల్ల మనకే నష్టం : మాజీ ఉపరాష్ట్రపతి