
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న స్వాతంత్ర దినోత్సవం లో భాగంగా ఎర్రకోటపై భారత జెండాను ఎగురవేసి అనంతరం అక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ గురించి స్పష్టతనిచ్చారు. ఆపరేషన్ సింధూర్ వీర జవాన్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెల్యూట్ చేశారు. పహల్గాం లో మతం పేరిట ఉగ్రవాదులు మన ఆడబిడ్డల పసుపు కుంకాలను తెంచేశారు. మతం పేరిట ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు అని అన్నారు. మన భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్రవాదులకు దీటైన సమాధానం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు. మన భారత ఆర్మీ అనుకుంటే ఏదైనా సాధించగలదు అని నిరూపించారు. పాకిస్తాన్లోకి చొచ్చుకెళ్లి మరి ఉగ్రవాద స్తావరాలను ధ్వంసం చేయడంలో మన ఆర్మీ చాలా కృషి చేసింది అని చెప్పుకొచ్చారు.
Read also : సీఎం యోగిపై ప్రశంసలు, మహిళా ఎమ్మెల్యేపై ఎస్పీ సస్పెన్షన్!
ఇక ఇప్పటికే పాకిస్తాన్ సింధు నది జలాల కోసం కొట్టుమిట్టాడుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సింధు నదిపై భారతదేశానికి మాత్రమే పూర్తి హక్కులు ఉన్నాయని అన్నారు. ఒకవైపు నీళ్లు మరోవైపు రక్తం ప్రవహిస్తాయేమో కానీ.. నీళ్లు, రక్తం రెండూ కలిసి ప్రవహించలేవు అని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. అలాగే ఈ మధ్య జరిగినటువంటి ప్రకృతి విపత్తుల్లో మరణించిన వారందరికీ కూడా నరేంద్ర మోడీ సంతాపం తెలియజేశారు. స్వాతంత్ర దినోత్సవం అంటే దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజల పండుగ అని అర్థం. ప్రతి ఒక్కరూ స్వాతంత్ర దినోత్సవాన్ని పండుగల భావించాలని సూచించారు. దేశం కష్టాల్లో ఉంటే కులం, మతం, ప్రాంతం చూడకుండా సమైక్య భావనతో కలిసిమెలిసి ముందుకు సాగాలి అని అన్నారు. దేశానికి కష్టం వస్తే.. దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఇది నా కష్టం అని భావించి ముందడుగు వేసేలా ధైర్యంతో ఉండాలి అని అందరికీ ఆత్మవిశ్వాసాన్ని నరేంద్ర మోడీ నింపారు . నరేంద్ర మోడీ స్పీచ్ తో ప్రతి ఒక్కరి గుండెల్లో ధైర్యం చేకూరింది. ఇలాంటి ప్రధానమంత్రి కదా మనకి కావాల్సింది అని కామెంట్లు చేస్తున్నారు.
Read also : ట్రంప్, పుతిన్ 3 గంటల సమావేశం, చివరికి ఏం తేలకుండానే…