
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- అయోధ్య రామ మందిర్ నిర్మాణం పూర్తయిన సందర్భంగా మన ప్రధాని నరేంద్ర మోడీ ధ్వజారోహణ కార్యక్రమం ఇవాళ అయోధ్యలో నిర్వహిస్తున్నారు. ధ్వజారోహణ వేడుక కోసం ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యకు చేరుకుని కాసేపట్లో రాములోరి జెండాను ఆవిష్కరించనున్నారు. ఇందులో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా అసలు ఈ రాములోరి జండా ప్రత్యేకతలు ఏంటి అని చర్చిస్తున్నారు. అయితే తాజాగా ఈ జెండాకు సంబంధించి ప్రత్యేకతలు ఏంటో తెలిసిపోయాయి. జెండాపై సూర్యుడు, ఓం చిహ్నం, కోవిదారు వృక్ష చిహ్నాలు ఉంటాయని సమాచారం. అయితే జెండాపై రాముడి సూర్యవంశం సూచించేలా భానుడి చిహ్నం, ఈ విశ్వంలో సంపూర్ణ పవిత్ర శబ్దం ఓం చిహ్నం, మందారం మరియు పారిజాత వృక్షాలు అంటుకట్టతో ఈ కశ్యపు రుషి చెట్లు సృష్టించారు అని పురాణాలు తెలిపాయి. సీతారాములను అయోధ్యకు తీసుకు వెళ్లేందుకు భరతుడు వస్తున్నాడని ఈ జెండానే దూరం నుంచి చూసిన లక్ష్మణుడు అన్నకు సమాచారం అందించాడు అని రామాయణంలో విన్నాము. ఇవి తెలుసుకుంటున్న రాములోరి భక్తులు ఈ జెండా వెనుక ఎంత మహిమ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు.
Read also : Telangana politics: బీఆర్ఎస్‌కు నిధుల కొరత.. రూ.15 కోట్లకు తగ్గిన డొనేషన్లు
Read also : Telangana politics: బీఆర్ఎస్‌కు నిధుల కొరత.. రూ.15 కోట్లకు తగ్గిన డొనేషన్లు





