
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి INC నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు భయపడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. మోడీ భయపడడానికి ఎన్నో ఉదాహరణలు ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. ట్రంప్ అంటే భయం ఉంది కాబట్టే రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేయదని మోడీ.. ట్రంప్ కు హామీ ఇచ్చినట్లుగా ట్రంప్ అమెరికాలో ఎన్నో సందర్భాల్లో ప్రకటించారు. ట్రంప్ చాలా విధాలుగా భారత్ గురించి ఏం మాట్లాడినా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం స్పందించడం లేదు. తాజాగా ఈజిప్టులో జరిగినటువంటి పీస్ సమ్మిట్ కు కూడా నరేంద్ర మోడీ డుమ్మా కొట్టారు అని చెప్పుకోచ్చారు. రెండు దేశాల మధ్య విభేదాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్న కూడా నరేంద్ర మోడీ మాత్రం ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూనే ఉంటారా అని ప్రశ్నించారు. ఆపరేషన్ సింధూర్ గురించి కూడా పలు సందర్భాల్లో డోనాల్డ్ ట్రంప్ చాలా విడ్డూరంగా, విరుద్ధంగా మాట్లాడారని.. అయినా కానీ మోడీ ఎందుకు ఇంత సైలెంట్ గా ఉంటున్నారంటూ?.. మోడీపై తీవ్రంగా విమర్శలు చేశారు. దీంతో రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ నేతలు అంతా కూడా రాహుల్ గాంధీ చెప్పినటువంటి మాటనే అన్ని సభల్లో వాడుతున్నారు. మరోవైపు ప్రధానమంత్రి ఏదైనా చేస్తున్నారంటే దాని వెనుకాల ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది అని ప్రధానమంత్రి కి సపోర్ట్ గా నిలుస్తున్నారు.
Read also : డేటింగ్ చేస్తే ఆ హీరో తోనే… తేల్చి చెప్పిన అనసూయ..!
Read also : త్వరలోనే చికెన్ షాపులకు కూడా లైసెన్సులు.. మాంసాభివృద్ధి సంస్థ కీలక నిర్ణయం..!