
క్రైమ్ మిర్రర్, అమరావతి బ్యూరో:–
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రధాని మోడీ, అమిత్‌షా అయితే… పవన్‌కు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు.. సరదాగా మాట్లాడుతున్నారు. జోకులు వేసుకుంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే… చంద్రబాబు కంటే పవన్‌కే ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. ఏపీ పర్యటనలోనూ ప్రధాని మోడీ పవన్‌తో అంతే క్లోజ్‌గా ఉన్నారు. ఆయనపై ప్రేమ కురిపించారు. పవన్ కళ్యాణ్ ఉపన్యాసం అయిన తరువాత దగ్గరకు పిలిపించుకుని చాక్లెట్ గిఫ్ట్‌గా ఇచ్చారు మోడీ. ప్రధానితో పవన్‌కు ఉన్న సఖ్యత చూసి అక్కడి వారంతా మరోసారి నోరెళ్లబెట్టారు.
అసలు ఏం జరిగిందంటే… అమరావతి పునర్‌నిర్మాణ పనుల ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ 10 నిమిషాలు మాట్లాడారు. అమరావతి రైతుల పోరాటం, వాళ్లు పడిన కష్టాలను వివరించారు. అంతేకాదు.. అమరావతి నిర్మాణానికి ప్రధాని మోడీ చేస్తున్న సాయాన్ని కూడా కొనియాడారు. అయితే… ప్రసంగం మధ్యలో తరచూ దగ్గారు పవన్. దీన్ని ప్రధాని మోడీ గమనించారు. పవన్ కళ్యాణ్ దగ్గుతో బాధపడుతున్నారని గ్రహించినట్టు ఉన్నారు. దగ్గు నుంచి ఉపశమనం కోసం పవన్ కళ్యాణ్‌కు మందు ఇవ్వాలని విక్స్ చాక్లెట్ తెప్పించారు మోడీ. ప్రసంగం అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్.. తన స్థానంలో కూర్చుకున్నారు. ప్రధాని మోడీ ఆయన్ను పిలిచారు. కానీ… పవన్ కళ్యాణ్‌కు వినిపించలేదు. ఆయన పనిలో ఆయన ఉన్నారు. దీంతో.. పక్కనున్న సీఎం చంద్రబాబుకు చెప్పి… పవన్ కళ్యాణ్‌ను పిలిపించారు. ప్రధాని పిలుస్తున్నారని చంద్రబాబు చెప్పగానే… పవన్ కళ్యాణ్ వెంటనే లేచి ఆయన దగ్గరకు వెళ్లారు. వీరిద్దరి మధ్య సంభాషణ జరిగింది. ఆ తర్వాత… విక్స్ చాక్లెట్ తీసి పవన్ కళ్యాణ్ చేతిలో పెట్టారు ప్రధాని మోడీ. దగ్గుతో ఇబ్బంది పడుతున్నట్టు ఉన్నావ్.. విక్స్ చాక్లెట్ చప్పరించు అని చెప్పినట్టు ఉన్నారు. ప్రధాని మోడీకి కృతజ్ఞతలు చెప్పి… ఆ చాక్లెట్ తీసుకుని… తన స్థానంలోకి వెళ్లి కూర్చున్నారు పవన్.
ఈ ఒక్క సన్నివేశం చూస్తే చాలు… పవన్‌కళ్యాణ్, ప్రధాని మోడీ మధ్య ఎంత బాండింగ్ ఉందో అర్థమవుతుంది. అయితే… ఇక్కడ అర్థం కాని విషయం ఒకటే. ప్రపంచంలోనే అత్యంత పవర్‌ఫుల్ ప్రధానిగా గుర్తింపుతెచ్చుకున్న మోడీ…. పవన్ కళ్యాణ్‌తో ఎందుకు ఇంత సాన్నిహిత్యంగా ఉన్నారు..? ఏపీ పర్యటనలో కాదు… ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి పవన్ కళ్యాణ్ వెళ్లినప్పుడు కూడా వేదికపై ఉన్న పవన్ కళ్యాణ్‌తో సరదాగా మాట్లాడారు ప్రధాని మోడీ. కాషాయ వస్త్రాలతో వెళ్లిన తనను చూసి… హిమాలయాలకు వెళ్లిపోతున్నావా అని ప్రధాని అడిగారని పవన్ కళ్యాణ్ కూడా అప్పుడు చెప్పారు. అయితే ఇదంతా… పవన్ కళ్యాణ్‌పై అభిమానమేనా..? రాజకీయ వ్యూహమా..? అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌తో కలిసి ఉంటే రాజకీయంగా ప్రయోజనాలు ఉంటాయనే… మోడీ ఆయనపై ఎక్కువ ప్రేమగా ఉంటున్నారని కొందరి అభిప్రాయం. ఇందులో ఎంత నిజముందో ఏమో కానీ…. ప్రస్తుతానికి ఇద్దరి మధ్య బాండింగ్ మాత్రం గట్టిగానే ఉందని చెప్పాలి.
నీట్’ పరీక్షకు భద్రత ఏర్పాట్లు… పరీక్ష కేంద్రాలను పరిశీలించిన సీపీ గారు!
డ్వాక్రా మహిళలకు పెద్దపీట వేసిన ఏపీ ప్రభుత్వం!.. డ్వాక్రా మహిళలకు ప్రత్యేకంగా యాప్ ప్రారంభం?