
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొంతమంది ఎమ్మెల్యేలపై తీవ్రంగా మండిపడ్డారు. ఎందుకంటే నేటి అసెంబ్లీ సమావేశాలకు చాలామంది ఎమ్మెల్యేలు రాకపోవడం పై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఎన్నో విషయాలు గురించి చర్చించాల్సి ఉంటుంది. ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాంటి చర్చలు జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం ఏంటని ప్రశ్నించారు. ఈరోజు సమావేశాలు ప్రారంభమయ్యే సమయానికి అసెంబ్లీ సభలో కేవలం 30 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండడాన్ని చూసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణించారు. ఈసారి నుంచి పూర్తిస్థాయిలో సభ్యులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ విప్ జిబి ఆంజనేయులు అప్రమత్తం చేశారు చంద్రబాబు నాయుడు. దీంతో వెంటనే కలుగజేసుకొని జీవి ఆంజనేయులు అప్పటికప్పుడు 17 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ సమావేశాలకు పిలిపించారు. ఈసారి ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీ సమావేశాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ హాజరు కావాల్సిందే అని ఎమ్మెల్యేలకు చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే కూటమి చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను కూడా ఆయా నియోజకవర్గం ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు ప్రజల్లోకి వెళ్లి వివరించాలని కోరారు. ప్రజా సమస్యలపై ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా పోరాడాల్సి ఉంటుందని.. ఎవరైనా అభివృద్ధి పనులకు దూరంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.
Read also : కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి అతడు ఒక సైన్యం
Read also : అద్భుతమైన VFX ను తలపించేలా ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాలు!