తెలంగాణ

సీఎం రేవంత్‌ను లైట్ తీసుకున్న వరంగల్ ఎమ్మెల్యేలు.. పొంగులేటికి రెడ్ కార్పెట్

తెలంగాణ కాంగ్రెస్ లో వర్గపోరు ముదురుతోంది. అన్ని జిల్లాల్లోనూ నేతల మధ్య వర్గ విభేదాలు తీవ్రమతున్నాయి.కొన్ని జిల్లాల్లో పార్టీగా రెండుగా చీలిపోయిందని తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ వచ్చినా లైట్ తీసుకున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ముఖ్యమంత్రికి ఆహ్వానం పలికేందుకు డుమ్మా కొట్టారు స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి.
జిల్లాకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ఆసక్తి చూపలేదు కొందరు వరంగల్ కాంగ్రెస్ నేతలు.

కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి కూతురి పెళ్లికి వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే సీఎం తన నియోజకవర్గానికి వస్తే కనీసం పలుకరింపుగా కూడా కలవలేదు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. వరంగల్ పశ్చిమ సీటు విషయంలో ఎప్పటి నుంచో ఎడమొహం పెడమొహంగా నాయిని రాజేందర్ రెడ్డి, జంగా రాఘవ రెడ్డి ఉన్నారు. నాయిని, జంగా మధ్య విభేదాల సెగ సీఎంకు తాకాయి. సీఎం రేవంత్ పర్యటనలకు దూరంగా ఉన్నారు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్గ విభేదాలతో తలలు పట్టుకుంటున్నారు కాంగ్రెస్ అధిష్టానం.

మరోవైపు పెళ్లి కార్యక్రమం కోసం వరంగల్‌కు వచ్చిన రేవంత్ రెడ్డికి స్వాగతం పలకడానికి స్థానిక ఎమ్మెల్యే, హన్మకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి రాలేదు.కానీ రేవంత్ రెడ్డి వెళ్లిపోయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి నాయిని రాజేందర్ రెడ్డి భద్రకాళి బండ్, మాడవీధుల పనుల పురోగతి పరిశీలించడానికి వెళ్లారు.సీఎంను కలవడానికి రాలేదు కానీ మంత్రి పొంగులేటితో కలిసి తిరగడం పై సంచలనంగా మారింది.ఇప్పటికే సీఎం పర్యటనలకు దూరంగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఉండటం.. అదే బాటలో రాజేందర్ రెడ్డి పోతుండటంతో జిల్లా వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.

ఇవి కూడా చదవండి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button