
మునుగోడు, క్రైమ్ మిర్రర్:- మునుగోడు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ,పాలకవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమం వైభవంగా జరిగింది. సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ పాలకవర్గంతో కలిసి ప్రాచీన శివరామ ఆలయములో పూజలు నిర్వహించి, చౌరస్తాలోని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రమాణస్వీకార కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటీ సత్యం,నల్లగొండ జిల్లా డిసిసి అధ్యక్షులు పున్న కైలాష్ నేత,మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి,మాజీ డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి, పాల్గొని సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ లతోపాటు ఉప సర్పంచ్ వార్డు సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ…గ్రామాల్లో ఆర్ధికంగా బలపడిన వ్యక్తులు తమ గ్రామ అభివృద్ధికి సమయం కేటాయించి అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ప్రజల మద్యలో వుండి ప్రజల సమస్యలను పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు.
Read also : KCR చేసిన వ్యాఖ్యలకు కౌంటర్లు ఇస్తున్న కాంగ్రెస్ నాయకులు!
గ్రామ పంచాయతీ అభివృద్ధికి ప్రభుత్వం తరుపున సహకారం అందిస్తామని అన్నారు. సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ మాట్లాడుతూ..గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఆశీర్వదించి గెలిపించినందుకు గ్రామ ప్రజలకి రుణపడి వుంటాము అన్నారు. గ్రామ అభివృద్దే ప్రధాన లక్ష్యంగా అందరినీ కలుపుకొని మునుగోడు గ్రామ పంచాయతీనీ ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దుతామని అన్నారు. పార్టీలకు అతీతంగా సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ లను శాలువాలతో సన్మానించారు. ప్రత్యేక అధికారి,మునుగోడు సూపరిండెంట్ భాస్కర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి,పాల్వాయి చెన్నారెడ్డి,పాల్వాయి గోవర్దన్ రెడ్డి,శ్రీరామోజు వెంకటేశ్వర్లు,వివిధ శాఖల అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు,యువత గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Read also : జనవరి నెలలో సగానికి పైగా సెలవులు.. ఎలా అంటే?





