
మందమర్రి,క్రైమ్ మిర్రర్:- మందమర్రి మండల పరిధిలోని చారిత్రాత్మక గాంధారి ఖిల్లా వద్ద వెలసిన మైసమ్మ తల్లిని గిరిజన భక్తులు భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ప్రతి సంవత్సరం పుష్య మాసంలో నిర్వహించే సంప్రదాయ పూజల్లో భాగంగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్ర నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా గిరిజన మహిళా నాయకురాలు కొమురం భీం,ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ గాంధారి ఖిల్లా మైసమ్మ తల్లిని పూజించడం వందల ఏళ్లుగా వస్తున్న ఆచారమని, ముఖ్యంగా గోండు వంశస్థులు ఈ పూజలను అత్యంత నిష్ఠతో నిర్వహిస్తారని తెలిపారు.
Read also : అంగరంగ వైభవంగా ‘పంబరట్టు మహోత్సవం’
గిరిజన ఆచారాల ప్రకారం జెండా ఎగురవేసి, ఖిల్లా లోపలికి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు,మొక్కులు చెల్లించుకున్నట్లు పేర్కొన్నారు.కేవలం గోండు వంశస్థులే కాకుండా, మైసమ్మ తల్లి మహిమలను నమ్మి ఇతర ప్రాంతాల నుండి, ఇతర వర్గాల ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారని ఆమె వివరించారు. జంగుబాయి, ఉట్నూర్ ,కేస్లాపూర్ జాతరల వలె గాంధారి ఖిల్లా మైసమ్మ పూజలు కూడా గొండు రాజుల కాలం నుండి వస్తున్నాయని, ఈ వారసత్వాన్ని తాముగర్వంగా కొనసాగిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.నెల రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆయన ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. గిరిజన సంస్కృతి, ఆచారాలకు అద్దం పట్టేలా ఈ పూజా కార్యక్రమాలు ఘనంగా కొనసాగుతున్నాయి.
Read also : శ్రీశైలం పాతాళగంగ సమీపంలో అర్ధరాత్రి చిరుత పులి కలకలం?





