తెలంగాణరాజకీయం

సై అంటే సై అంటున్న రసమయి, కవ్వంపల్లి - లడాయి ఎందుకో తెలుసా..?

ఒకరేమో ఎమ్మెల్యే.. మరొకరు మాజీ ఎమ్మెల్యే. సాధారంగా అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కామనే. కానీ ఈ ఇద్దరి మధ్య ఫైట్‌ పీక్స్‌కి చేరింది. నువ్వెంత అంటే నువ్వెంత అని అనుకునే వరకు వచ్చింది. సై అంటే సై అంటూ తలలు ఎగరేస్తున్నారు ఆ ఇద్దరు ప్రజాప్రతినిధులు. ఘాటు విమర్శలే కాదు… ట్వీట్‌ వార్‌తోనూ పొలిటికల్‌ హీట్‌ రాజేశారు. ఇంతకీ… వీరి మధ్య గొడవ ఎందుకింత తారాస్థాయికి చేరిందో తెలుసా…?

కరీంనగర్‌ జిల్లా మానుకొండూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు కవ్వంపల్లి సత్యనారాయణ. ఈయనపై అవినీతి ఆరోపణలు చేశారు బీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌. సీఎం రిలీఫ్‌ ఫండ్‌లో పెద్ద స్కామ్‌ చేశారంటూ ఆరోపించారు. అంతేకాదు.. కమిషన్ల కోసం పాత కాంట్రాక్ట్‌ పనులను రద్దు చేశారని కూడా విమర్శించారు. ఈ ఆరోపణలపై… దమ్ముంటే చర్చకు రావాలని కవ్వంపల్లి ట్వీట్‌ చేయడంతో… గొడవ మొదలైంది. కవ్వంపల్లి, రసమయి మద్య సవాళ్ల పర్వం నడిచింది.. నడుస్తోంది కూడా. కవ్వంపల్లి అవినీతి మొత్తం సాక్ష్యాలతో సహా తన దగ్గర ఉందని అంటున్నాడు రసమయి. దుమ్ముంటే చర్చకు రావాలని ఛాలెంజ్‌ చేశాడు.

Read More : బీఆర్‌ఎస్‌ వద్దు టీఆర్‌ఎస్‌ ముద్దు – పేరు మార్పుకు డేట్‌ ఫిక్స్‌ – తప్పు సరిచేసుకుంటున్న కేసీఆర్‌

రసమయి ఆరోపణలకు గట్టి కౌంటర్‌ ఇచ్చారు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. సై అంటే సై, బస్తీమే సవాల్‌… రా చూసుకుందాం.. అనే రీతిలో ప్రతిసవాళ్లు చేశాడు కవ్వంపల్లి. ఆరోపించడం కాదు… దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలని రసమయికి ఛాలెంజ్‌ చేశాడు. నా చిట్టా ఆయన దగ్గర ఉండటం ఏంటి… రసమయి దండుకున్న కమిషన్ల చిట్టానే తన దగ్గర ఉందన్నాడు. చిన్న చిన్న పదవులు ఇప్పించేందుకు కూడా డబ్బులు తీసుకున్న చరిత్ర రసమయి బాలకిషన్‌ది అని కౌంటర్‌ ఇచ్చారు. వీటిపై దమ్ముంటే చర్చకు రా.. చూసుకుందా.. దాక్కునే వైఖరి తనది కాదంటూ కవ్వంపల్లి ట్వీట్‌ చేశాడు. దీనికి రియాక్ట్‌ అయిన రసమయి… నియోజకవర్గంలో కనిపించకుండా హైదరాబాద్‌లో దాక్కున్నది నువ్వే అంటూ రివర్స్‌ ఎటాక్‌ చేశారు. కవ్వంపల్లి అవినీతిపై త్వరలోనే కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు రసమయి.

Read More : పీచేముడ్‌ అంటున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు – బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానంటున్న ఎమ్మెల్యే గూడెం

వీరి మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరడంతో… బుధవారం (మార్చి 19న) రసమయి ఇంటిని ముట్టడించారు కాంగ్రెస్‌ కార్యకర్తలు. దీంతో.. ఈ రచ్చ మరింత ముదిరింది. ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వస్తే భగ్గుమనేలా ఉంది. దమ్ముంటే క్యాంప్‌ ఆఫీసుకు రా.. చర్చకు సిద్ధంగా ఉన్నానని రసమయి అంటున్నారు. ఈ లొల్లి.. ఎంత వరకు వెళ్తుందో… చూడాలి.

Back to top button