
మునుగోడు,క్రైమ్ మిర్రర్:- విజయవాడ కనక దుర్గమ్మ సాక్షిగా తనపై వస్తున్న తప్పుడు కథనాలను, దుష్ప్రచారాలను మరోసారి మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అమ్మవారి దర్శనానికి వచ్చిన రాజ్ గోపాల్ రెడ్డి కి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నిన్న ఒక సామాజిక కార్యక్రమంలో పాల్గొనడానికి గుంటూరు వచ్చాను. ఈరోజు విజయవాడ అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగిందని.. నేను ఇక్కడికి బయలుదేరినప్పటి నుండి రాజకీయంగా నా పై దుష్ప్రచారం చేస్తున్నారు. నేను నిన్ననే మీడియా ముందు క్లారిటీ ఇచ్చాను.. అయినా కూడా కొంతమంది కావాలని నా ప్రతిష్టను దెబ్బతీయడానికి దుష్ప్రచారం చేస్తున్నారు వాటిని నమ్మొద్దు అని చెప్పారు.
నేను ఎటువంటి రాజకీయ నిర్ణయం తీసుకోవడం లేదు
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల అన్నదమ్ములు లాగా కలిసి ఉండి రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండి అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని అమ్మవారిని ప్రార్థించ అన్నారు. మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదలకు అండగా ఉండే కార్యక్రమాలు చేపడుతుంది అని తెలిపారు.
Read also : 20 వేల మందితో బతుకమ్మ… హెలికాప్టర్ల నుంచి పూలవర్షం!
Read also : దీపికాను తీసేయడం పట్ల సోషల్ మీడియాలో ఫాన్స్ మధ్య వార్?