
క్రైమ్ మిర్రర్, తెలంగాణ :-
యాదగిరిగుట్ట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. లక్షల ఖర్చు చేసి కార్పొరేట్ వైద్యశాలల్లో చికిత్స చేయించుకోలేని వారికి సీఎంఆర్ఎఫ్ పథకం కొండంత అండగా ఉంటుందన్నారు. ప్రజాపాలనలో అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఏలూరు రామ్ రెడ్డి గుండాల గ్రామ శాఖ అధ్యక్షులు అన్నెపర్తి యాదగిరి కాంగ్రెస్ పార్టీ నాయకులు పొడిశెట్టి వెంకన్న నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు ఉన్నారు.
ఇబ్రహీంపట్నం తుర్కయంజాల్ లో ఉద్రిక్త పరిస్థితులు
మోహన్ బాబు ఇంటి ముందు బైఠాయించిన మనోజ్… భారీగా పోలీసు బందోబస్తు!.. ఏం జరుగుతోంది?