
క్రైమ్ మిర్రర్, మిర్యాలగూడ: క్రైమ్ మిర్రర్ న్యూస్ పేపర్ ప్రజల సమస్యలను నిష్పక్షపాతంగా వెలుగులోకి తీసుకొచ్చే విషయములో కీలక పాత్ర పోషిస్తోందని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్) కొనియాడారు..
నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో “క్రైమ్ మిర్రర్ న్యూస్ పేపర్” 2026 సంవత్సరానికి సంబంధించిన నూతన క్యాలెండర్‌ను మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్) శనివారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందని, ప్రజల సమస్యలను నిష్పక్షపాతంగా వెలుగులోకి తీసుకువచ్చే బాధ్యత మీడియాపై ఉందని తెలిపారు.
“క్రైమ్ మిర్రర్ న్యూస్ పేపర్” ఇదే ధోరణితో ముందుకెళ్తూ ప్రజల ఆదరణ పొందాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.





