Homeక్రైమ్దారి త‌ప్పిన ఖాకీలు

దారి త‌ప్పిన ఖాకీలు

  • మ‌హిళ నుంచి రూ.1.82కోట్లు వ‌సూలు
  • ఇద్ద‌రి ఎస్ఐల పై కేసు న‌మోదు

భద్రాద్రి కొత్తగూడెం, క్రైమ్ మిర్ర‌ర్: ర‌క్ష‌ణ క‌ల్పించి మోసాల‌ను అరిక‌ట్టాల్సినే ఖాకీలే అడ్డ‌దారులు తొక్కారు. వివ‌రాల ప్ర‌కారం సార‌పాక‌కు చెందిన భుక్య కుమారి 2023లో భ‌ద్రాచ‌లంలో ఎస్ ఐగా విధులు నిర్వ‌హిస్తున్న మ‌హేశ్‌తో ప‌రిచ‌యంతో అధిక లాభాలు వ‌స్తాయ‌ని ఆశ‌చూప‌డంతో వ్యాపారంలో పెట్టుబడులు పెట్టింది.

మ‌హేశ్ సోద‌రుడు కూడ ఎస్ ఐ అయిన రాణా ప్ర‌తాప్, వారి తండ్రి చంద్ర‌య్య కూడ‌పెట్టుబ‌డిపెట్టిండంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఇలా ముగ్గురు 35శాతం వ‌డ్డీతో ఎక్కువ లాభాలు వ‌స్తాయ‌ని రూ.1.82కోట్లు వ‌సూలు చేశారు. దీంతో అధిక లాభాలు రాలేదు కాని అస‌లును ఇవ్వ‌డానికి తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేశారు.

ఈ విష‌య‌మై అడిగితే దాట వేయ‌డం, గ‌ట్టిగా అడిగితే బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారు. దీంతో ఆమె ఆర్థికంగా న‌ష్ట‌పోయి అప్పులపాల‌య్యింది. దీంతో బాధిత మ‌హిళ చేసేది ఏమి లేక పూర్తి ఆధారాల‌తో బూర్గంపాడు పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది. మ‌హిళ ఫిర్యాదు మేర‌కు ఎస్ సై మ‌హేశ్‌, ఎస్ ఐ రాణా ప్ర‌తాప్‌, అలాగే తండ్రి చంద్ర‌య్య‌ల పైకూడ కేసు న‌మోదు చేశారు. గౌర‌వ ప్ర‌ద‌మైన‌, బాధ్య‌త‌యుత‌మైన స్థానంలో ఉండి ఇలా ఇద్ద‌రు ఎస్ ఐ లు అడ్డ‌దారులు తొక్క‌డం ప‌ట్ట‌ణంలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

తాజావార్తలు