సినిమా

మిరాకిల్ మిరాయ్… క్రైమ్ మిర్రర్ రివ్యూ ఇదే?

క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- హనుమాన్ సినిమాతో ఆకట్టుకున్న యువ హీరో తేజ.. మిరాయ్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా నేడు ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అవ్వగా ప్రతి ఒక్కరు కూడా థియేటర్స్ కు వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాని యువ దర్శకుడైనటువంటి కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించగా హీరోగా తేజ, విలన్ గా మంచు మనోజ్, హీరోయిన్గా రితిక నాయక్ నటించారు. ఈ చిత్రం ఎన్నో భారీ అంచనాల నడుమ విడుదలైనప్పటికీ.. తెలుగు ప్రేక్షకులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకున్నారు. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కొడుతుందా లేదా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Read also : తెలంగాణలో మరో 4 రోజులపాటు వర్షాలు.. జర జాగ్రత్త!

రివ్యూ

ఈ సినిమా కథ తొమ్మిది మహా గ్రంథాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మహా గ్రంధాలను రక్షించేందుకు ప్రత్యక్ష శక్తులు కలిగిన వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. హీరో తేజ హనుమాన్ సినిమా లాగానే.. ఈ మిరాయ్ సినిమా కూడా ఒక డివోషనల్ ఎలిమెంట్స్ తో కూడిన కథగా ఉంటుంది. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని యువ హీరో తేజకు యాక్షన్ సీన్స్ అలాగే కామెడీ సీన్స్ ను ప్రత్యేకంగా రాసుకున్నట్లు ఉన్నారు. ఎప్పుడైతే మంచు మనోజ్ విలన్ పాత్రలో ఎంట్రీ ఇస్తారో… అప్పటినుంచి సినిమా కాస్త ఆసక్తికరంగా మారుతుంది. ప్రతి యాక్షన్ అలాగే ట్విస్ట్ కూడా ప్రేక్షకులను థియేటర్లలో కదలనివ్వకుండా చేస్తుంది. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ కథ కాస్త నెమ్మదిగా సాగిన కూడా.. హీరో తేజ మిరాయ్ పాత్రలో వచ్చినప్పటి నుంచి సినిమా చాలా వేగంగా సాగుతుంది. ఇక మొత్తంగా సినిమాలోని నటీనటులు అందరూ కూడా చాలా అద్భుతంగా నటించారు. మంచు మనోజ్ తన విలన్ పాత్రకు ప్రాణం పోశారంటే అందులో డౌట్ లేదు. తల్లి క్యారెక్టర్ గా శ్రీయకు చాలా కాలం తర్వాత ఒక బలమైన పాత్ర దక్కింది. జగపతిబాబు కూడా తన పాత్రలో ఒదిగిపోయారు.

Read also : తెలంగాణలో మరో 4 రోజులపాటు వర్షాలు.. జర జాగ్రత్త!

ఇక ఓవరాల్ గా చూసుకుంటే మిరాయ్ అనే ఈ సినిమా థియేటర్లలో చూడాల్సినటువంటి ఒక మంచి విజువల్ ఫీస్ట్ సినిమా. కథ అలాగే విజువల్ ఎఫెక్ట్స్ చాలా అద్భుతంగా ఆకట్టుకుంటాయి. ఏది ఏమైనా హీరోగా తేజ అభిమానుల ఎక్స్పెక్టేషన్స్కు తగ్గట్టుగా నటించారు. అభిమానులకు ఈ సినిమా ఎంతగానో నచ్చుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక యాక్షన్ మరియు ఫాంటసీ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమా ఒక మంచి ఎంపిక అవుతుంది. మొత్తానికి యువ హీరో తేజ ఈ సినిమాతో మరొక హిట్ ను అందుకోబోతున్నారు.

రేటింగ్:- 8.5/10

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button