క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసి చాలా ఏళ్లైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేయలేదు. దీంతో ఆశావాహులు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. కుటుంబాలు వేరు పడిన వారు.. కొత్తగా పెళ్లిళ్లు చేసుకున్నవారు రేషన్ కార్డులు ఎప్పుడెప్పుడు మంజూరు చేస్తారా..? అని ఆశగా చూస్తున్నారు. అన్ని ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు లింకు పెడుుతండటంతో ప్రతి ఒక్కరూ రేషన్ కార్డుల కోసం పడిగాపులు కాస్తున్నారు. సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు మంజారు చేస్తామని ఇటీవల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. తాజాగా రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సైతం కొత్త రేషన్ కార్డులపై కీలక అప్డేట్ ఇచ్చారు.
Also Read : మేడ్చల్ సీఎంఆర్ కాలేజీ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. తల్లిదండ్రులతో కలసి విద్యార్థినిల ఆందోళన
త్వరలోనే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించారు. సిద్ధిపేట జిల్లా కోహెడలో పర్యటించి కార్యకర్తలతో సమావేశమైన మంత్రి పొన్నం.. అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు. ఈ మేరకు కసరత్తు జరుగుతోందని త్వరలోనే కార్డులు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. ప్రజాపాలన ధరఖాస్తుల ఆధారంగా రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు. ఏవరైనా రేషన్ కార్డుల కోసం ధరఖాస్తులు చేసుకోని వారుంటే మండల ఆఫీసుల్లో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చునని చెప్పారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలపైనా కీలక అప్డేట్ ఇచ్చారు. త్వరలోనే తెలంగాణలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని చెప్పారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని పార్టీ కార్యకర్తలకు మంత్రి పొన్నం సూచించారు.
Read Also : వృద్ధులు, దివ్యాంగులకు గుడ్ న్యూస్.. నేరుగా శ్రీలక్ష్మీ నరసింహుడిని దర్శించుకునే భాగ్యం
స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇప్పటి నుంచే నేతలు వ్యూహాత్మకంగా పని చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకువెళ్లాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయం, రైతు సంక్షేమం కోసం రూ. 30 వేల కోట్లు కేటాయిందని గుర్తు చేశారు. అర్హులైన వారందరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. తన సొంత నియోజకవర్గం హుస్నాబాద్‌కు 250 పడకల హాస్పిటల్ మంజూరు అయిందని చెప్పారు. త్వరలోనే హాస్పిటల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని.. ఇదే ఉత్సాహన్ని రాబోయే రోజుల్లో కొనసాగిస్తామని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి :