
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు మరింత ఉధృతంగా ముందుకు సాగుతున్నాయి. ఒకరిపై ఒకరు మాటలు యుద్ధం చేసుకుంటున్నారు. అధికార మరియు ప్రతిపక్ష పార్టీల మధ్య తారాస్థాయిలో వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని సంచలన ఆరోపణలు చేశారు. 2023వ సంవత్సరంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో 25 వేలు ఓట్లు సాధించిన బీజేపీ పార్టీ 2024 ఎంపీ ఎన్నికల్లో 64 వేల ఓట్లు ఎలా వచ్చాయి అని మంత్రి పొన్నం ప్రభాకర్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. ఇక అదే సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీకి 80,000 ఓట్లు వస్తే.. ఎంపీ ఎన్నికల్లో కేవలం 18 ఓట్లు మాత్రమే ఎందుకు వచ్చాయి అని నిలదీశారు. పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుంటే శాసనసభ ఎన్నికలు వచ్చేసరికి బిఆర్ఎస్ పార్టీకి బిజెపి మద్దతు పలుకుతుంది అని కీలక ఆరోపణలు చేశారు. కాగా ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్, బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీల నాయకులు విస్తృత స్థాయిలో పాల్గొంటున్నారు. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో మా పార్టీనే గెలుస్తుంది అంటూ ప్రతి ఒక్కరు కూడా ధీమా వ్యక్తం చేస్తున్న సందర్భంలో ఎవరు గెలుస్తారా అని నాయకులతో పాటు ప్రజలు కూడా చాలా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు.
Read also : వరల్డ్ కప్ విజేతలకు సూపర్ న్యూస్.. జట్టులోని ప్రతి మహిళకి టాటా కార్లు గిఫ్ట్!
Read also : “ది గర్ల్ ఫ్రెండ్” రివ్యూ… రష్మిక మరో మెట్టు ఎక్కినట్టే!





