తిరుమల, క్రైమ్ మిర్రర్: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం ఉదయం కలియుగ దైవం వేంకటేశ్వర స్వామివారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. తెల్లవారుజామున స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆలయ పండితులు వేద ఆశీర్వచనం, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. మంత్రి మాట్లాడుతూ స్వామివారి సేవలో పాల్గొనడం ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. ఆ కలియుగ ప్రత్యక్ష దైవం అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
