ఆంధ్ర ప్రదేశ్

3.22 కోట్లతో ఏపీ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల- కేటాయింపులు ఇలా..

ఆంధ్రప్రదేశ్‌లో బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్నాయి. 2025-26 వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశ పెట్టారు ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్‌. 3లక్షల 22 వేల 359 కోట్లతో బడ్జెట్‌ పెట్టారు. తొలిసారి 3లక్షల కోట్లు దాటింది ఏపీ బడ్జెట్‌. వ్యవసాయ బడ్జెట్‌ను 48వేల 340 కోట్లతో ప్రవేశపెట్టారు మంత్రి అచ్చెన్నాయుడు. మూలధనం అంచనా వ్యయం 40వేల 635 కోట్లు కాగా… రెవెన్యూ వ్యయం 2లక్షల 51వేల 162 కోట్లు. ఇక రెవెన్యూ లోటు 33వేల 185 కోట్లు.. ద్రవ్యలోటు 79వేల 926 కోట్లుగా ఉంది.

ఏపీ బడ్జెట్‌లో ఏయే శాఖలు ఎంత నిధులు కేటాయించారో చూద్దాం.

ఏపీ బడ్జెట్‌ కేటాయింపులు:

వైద్య-ఆరోగ్య-కుటుంబశాఖ : రూ.19,264 కోట్లు

జలవనరుల శాఖ: రూ.18,019 కోట్లు

పౌరసరఫరాల శాఖ: రూ.3,806 కోట్లు

ఉన్నత విద్యాశాఖ: రూ.2,506 కోట్లు

మున్సిపాలిటీ, పట్టణాభివృద్ధి శాఖ: రూ.13,862 కోట్లు

పంచాయతీరాజ్‌ శాఖ : రూ.18,847 కోట్లు

పరిశ్రమలు, వాణిజ్య శాఖ: రూ.3,156 కోట్లు

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శాఖ: రూ.1,228 కోట్లు

గృహమంత్రిత్వ శాఖ: రూ.8,570 కోట్లు

జలజీవన్‌ మిషన్‌: రూ.2,800 కోట్లు

పోలవరం ప్రాజెక్ట్‌ : రూ.6,750 కోట్లు

అర్‌ అండ్‌ బీ : రూ.8,785కోట్లు

యువజన, సాంస్కృతిక శాఖకు: రూ.469కోట్లు

అమరావతి నిర్మాణం: రూ.6వేల కోట్లు

రోడ్ల నిర్మాణం, మరమ్మతులు: రూ.4,220 కోట్లు

ఐటీఐ, ఐఐటీలు: 210 కోట్లు

రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌: రూ.10 కోట్లు

ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రాయితీలు: రూ.300 కోట్లు

ఎన్టీఆర్ భరోసా పింఛన్లు: రూ.27,518 కోట్లు

దీపం 2.0 పథకం: రూ.2,601 కోట్లు

మత్స్యకార భరోసా: రూ.450 కోట్లు

మధ్యాహ్నం భోజన పథకం: రూ.3,486 కోట్లు

ఆదరణ పథకం: రూ.1000 కోట్లు

మనబడి పథకం: రూ.3,486 కోట్లు

తల్లికి వందనం: రూ.9,407 కోట్లు

బీసీల సంక్షేమం : రూ.47,456 కోట్లు

ఎస్సీల సంక్షేమం : రూ.20,281 కోట్లు

ఎస్టీల సంక్షేమం: రూ.8,159 కోట్లు

ఎస్సీ, ఎస్టీ, బీసీల స్కాలర్‌షిప్స్‌: రూ.3,377 కోట్లు

ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్‌: రూ.400 కోట్లు

మహిళా శిశు సంక్షేమం, వృద్ధులు, దివ్యాంగులు: రూ.4,332 కోట్లు

స్వచ్ఛాంద్ర : రూ.820 కోట్లు

ధరల స్థిరీకరణ నిధి: రూ.300 కోట్లు

ప్రకృతి సేద్యం: రూ.62 కోట్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button