
క్రైమ్ మిర్రర్, హన్మకొండ:- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హన్మకొండ పర్యటన చుట్టూ రాజకీయ చర్చలు మళ్లీ వేడెక్కాయి. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాతృమూర్తి సంస్మరణ సభకు రేవంత్ రెడ్డి హాజరైన వేళ, స్థానిక మంత్రి కొండా సురేఖ గైర్హాజరు కావడం కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి రేపింది. రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్యేలు హాజరైనప్పటికీ మంత్రి కొండా సురేఖ రాకపోవడం పలు ఊహాగానాలకు తావిచ్చింది. కొండా సురేఖ అనుచరుల ప్రకారం ఈ కార్యక్రమానికి పిలుపు ఇవ్వలేదు. సమాచారం కూడా అందలేదు, అందుకే మంత్రి హాజరుకాలేదు అని తెలిపారు. అయితే పార్టీ వర్గాల్లో మరోవైపు దొంతి మాధవరెడ్డి, కొండా సురేఖ మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న రాజకీయ వైరమే దీనికి కారణమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇద్దరూ వరంగల్ రాజకీయాల్లో వేర్వేరు వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తెలిసిందే.
Read also : ప్రేమ పేరుతో మోసం చేసిన హోంగార్డ్.. అబార్షన్ సమయంలో యువతి మృతి..!
అంతేకాకుండా, పార్టీ సీనియర్ నాయకులలో కొందరు వ్యాఖ్యానిస్తూ నిన్న మంత్రి ఓఎస్‌డీని తొలగించిన రేవంత్ నిర్ణయంపై సురేఖ అసంతృప్తిగా ఉంది. అందుకే ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు, అని పేర్కొన్నారు. సురేఖ గైర్హాజరుతో రేవంత్ పర్యటనలో స్థానిక మంత్రిత్వ ప్రతినిధ్యం లేకపోవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది కాంగ్రెస్ లోపలి విభేదాల మరో సంకేతమా? లేక సమన్వయం లోపమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హన్మకొండలో దొంతి మాధవరెడ్డి మాతృమూర్తి సంస్మరణ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. మంత్రి సురేఖ గైర్హాజరు కావడం రాజకీయ చర్చలకు కారణమైంది.
Read also : ప్రేమ పేరుతో మోసం చేసిన హోంగార్డ్.. అబార్షన్ సమయంలో యువతి మృతి..!