తెలంగాణ

తెలంగాణకు టీటీడీ ప్రాధాన్యత ఇవ్వాలి.. మంత్రి కొండా సురేఖ

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ కు టీటీడీ ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి కొండా సురేఖ కోరారు. గతంలో తిరుమలలో తెలంగాణ నుంచి వచ్చే భక్తులకు ప్రాధాన్యత ఉండేదని.. కానీ, ఇప్పుడు నిర్లక్ష్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ లో గుడులు .. కల్యాణ మండపాల నిర్మాణానికి టీటీడీ సహకరించాలని కోరారు. ఇప్పటికే టీటీడీ నుంచి తెలంగాణ కు ప్రాధాన్యత పై సీఎం రేవంత్ ఏపీ ముఖ్యమంత్రితో చర్చించారని చెప్పుకొచ్చారు. తిరుమలలో తెలంగాణ నుంచి భక్తులు నిర్లక్ష్యానికి గురవుతున్నారని మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేసారు. శ్రీశైలం లో కొండా సురేఖ దర్శనం చేసుకున్నారు. రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాల ప్రజలు సంతోషంతో ఉన్నారని చెప్పుకొచ్చారు.

Also Read : మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు.. నివాళులు అర్పించిన ప్రధాని మోదీ

ఇక, తిరుమలలో తెలంగాణ భక్తులకు గతంలో దక్కిన విధంగా ప్రాధాన్యత ఉండాలని కోరారు. గతంలో టీడీపీ హయాంలో తెలంగాణ విషయంలో ఎలాంటి నిబంధనలను అమలు చేసారో.. వాటినే ఇప్పుడు అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేసారు. తెలంగాణ నుంచి టీటీడీకీ అధిక రాబడి వస్తోందని సురేఖ తెలిపారు. తెలంగాణలో ఆలయాలు – కల్యాణ మండపాల నిర్మాణం కోసం టీటీడీ ముందుకు రావాలని సురేఖ కోరారు. ఇప్పటికే తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి వీటి కోసం డిమాండ్ ఉందని చెప్పుకొచ్చారు. టీటీడీ కొత్త పాలక వర్గం ఈ మేరకు నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుతో టీటీడీ అంశాల పైన చర్చ చేసారని వెల్లడించారు. గతంతో టీటీడీ తెలంగాణ ప్రాంతంలోని ఆలయాలను అభివృద్ధి చేసేదని గుర్తు చేసిన సురేఖ..ఇప్పుడు కూడా అలానే చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి : 

  1. ఇక ఈ బ్యాంకు కనిపించదు.. 4 రోజులు సేవలు బంద్!!!
  2. శబరిమల ఆలయం మూసివేత!… మకర జ్యోతి ఎప్పుడో తెలుసా?
  3. తెలంగాణ సచివాలయంపై జాతీయ పతాకం అవనతం…వారం రోజుల పాటు అధికారిక వేడుకలు రద్దు
  4. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ వైసీపీ నిరసనలు
  5. బన్నీ పై నాకెందుకు కోపం!… చట్టపరంగానే వ్యవహరించా: సీఎం

Back to top button