తెలంగాణ

రెండు రోజులు ఎంజాయ్ చేయనివ్వండి.. కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి సెటైరికల్ కామెంట్స్

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : మాజీ మంత్రి కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సెటైరికల్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ రెండు రోజులు ఎంజాయ్ చేయనివ్వండి అని అన్నారు. కొత్త సంవత్సరం రోజు కేటీఆర్‌ను బాధ పెట్టకండి అని చెప్పారు. న్యూ ఇయర్ రోజు ఎంజాయ్ చేయనీయాలని అన్నారు. కేటీఆర్ గురించి 3, 4 వ తేదీల్లో చూద్దామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. జలసౌధలో ఇవాళ(మంగళవారం) నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నల్గొండ పార్లమెంటు పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్షించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. నల్గొండ ప్రజల దశాబ్దాల కల ఎస్ఎల్‌బీసీ(SLBC) ప్రాజెక్ట్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

Also Read : కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో ముగిసిన వాదనలు.. అప్పటివరకు అరెస్టు చేయొద్దు!!

అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే కాంట్రాక్టర్లు పనిచేయరని హెచ్చరించారు. కాంట్రాక్టర్ పని చేయకపోతే సంబంధిత మంత్రికి చెప్పాలన్నారు. దయచేసి అధికారులు కంటితుడుపు పనులు చేసే ప్రయత్నం చేయొద్దని వార్నింగ్ ఇచ్చారు. అధికారులు సీరియస్‌గా పని చేస్తే అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ పూర్తి చేయొచ్చని చెప్పారు. SLBC ప్రాజెక్ట్ 4 లక్షల ఎకరాలకు నీళ్లిచే ప్రాజెక్ట్ అని వివరించారు. SLBC, బ్రాహ్మణవెళ్లాంల ప్రాజెక్ట్‌లు తనకు తొలి ప్రాధాన్యమన్నారు. SLBC ఒక వరల్డ్ వండర్.. SLBC పూర్తయితే.. ప్రపంచమంతా వచ్చి చూస్తుందని అన్నారు. అధికారులు చాలా బాధ్యతతో పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. తన బ్రదర్ 26 బోర్లు వేసినా నీళ్లు రాలేక వేసిన పంట వదిలేశారని.. నల్గొండ అంత విపత్కర పరిస్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. SLBC ప్రాజెక్ట్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్ మంత్రి, డిప్యూటీ సీఎం అందరూ సపోర్ట్ చేస్తున్నారన్నారు. అమెరికా ఇంజనీర్లతో కలిసి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఏం కావాలన్నా చేసే మంత్రి ఉన్నారని గుర్తుచేశారు. చిన్న చిన్న సమస్యలతో పనులు ఆపడంపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also : పవిత్రమైన అయ్యప్ప మాలలో ఉండి.. ఇంత ఘోరమేంటి స్వామి..!!!

ఎంత ఆలస్యం అయితే. అంత ఖర్చులు పెరుగుతాయన్నారు. అమెరికన్ ఇంజినీర్లు ఆనాడు మిషన్ అమర్చిన రోజు మూడు రోజులు ప్రాజెక్ట్ దగ్గరే ఉన్నానని చెప్పారు. SLBC పూర్తి అయితే, ఫర్ షోర్ నుంచి… నీళ్లు తీసుకోవచ్చని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. SLBC ప్రపంచంలోనే అతిపొడవైన నీటిపారుదల టన్నెల్ అని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కొట్లాడి తాను 2005లో పాలన అనుమతి ఇప్పించానని గుర్తుచేశారు. SLBC పనులు మొదలు పెట్టామని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో పదేళ్లు వృథా చేశారని మండిపడ్డారు. మార్చిలో SLBC పనులు మొదలవుతాయని తెలిపారు. 20నెలల్లో టన్నెల్ తవ్వకం పనులు పూర్తి అవుతాయిని చెప్పారు. నల్గొండను రాబోయే నాలుగేళ్లలో ఉభయ గోదావరి జిల్లాలను మించి సస్య శ్యామలం చేస్తామని అన్నారు. ఆంధ్ర పాలకులే నల్గొండకు న్యాయం చేశారని చెప్పారు. పదేళ్లు నల్గొండ జిల్లాకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. వేముల ప్రశాంత్ రెడ్డి ఫామ్ హౌస్‌కు, ప్రగతి భవన్‌కు మంత్రిగా పనిచేశారని విమర్శించారు. ఆయనకు రోడ్ల గురించి ఏం తెలుసు అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు.

ఇవి కూడా చదవండి : 

  1. ఏడాది చివరి రోజు కూడా హైడ్రా కూల్చివేతలు.. ఆందోళనలో బాధితులు
  2. అడవి పందిని వేటాడిన మంచు విష్ణు!.. వీడియో బయటపెట్టిన మంచు మనోజ్!!
  3. తాగి రోడెక్కారో అంతే సంగతి.. తెలంగాణ పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ!!
  4. మద్యం ప్రియులకు పండగే.. పండగ… వైన్స్‌ షాపులు, బార్‌ల సమయ వేళలపై ప్రభుత్వం కీలక నిర్ణయం
  5. ఎక్సైజ్ కానిస్టేబుల్ తో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ రాసలీలలు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button