మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి రోడ్ షో

 

  • మీకు అందుబాటులో ఉండే అభ్య‌ర్థుల‌ను పెట్టినం
  • గ‌త ప్ర‌భుత్వం ఒక్క రేష‌న్ కార్డు ఇవ్వ‌లేదు
  • రోడ్ షో కు ప్రజల్లోంచి విశేష ఆదరణ

నల్గోండ, క్రైం మిర్ర‌ర్ః

నల్లగొండ పట్టణం మున్సిప‌ల్‌కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ప్ర‌చారంలో రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి రోడ్‌ షో నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న పానగల్లు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద మాట్లాడారు. మీకు అందుబాటులో ఉండే అభ్య‌ర్థుల‌నే కార్పొరేట్లుగా పెట్టినం.

కార్పొరేష‌న్ ఎన్నిక‌లు పేద ప్ర‌జ‌ల‌కు మంచి చేసే ఎన్నిక‌లు. గెలిచిన కార్పొరేట‌ర్లు మీ అభివృద్దికి పాటుప‌డుత‌రు. గ‌త ప్ర‌భుత్వం ఒక్క రేష‌న్ కార్డు కూడ ఇవ్వ‌లేదు. సొంతిల్లు కూడ ఇవ్వ‌లేదు.

కిటికీల‌కు అడ్డుక‌ట్టుకునే చీరెల‌ను ఆడ‌బిడ్డ‌ల‌కు ఇచ్చార‌ని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం వచ్చిన త‌రువాత స‌న్న బియ్యం, ఇందిర‌మ్మ ఇండ్లు, చీర‌లె ఇస్తున్నం.

మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం క‌ల్పించాం. 5సార్లు ఎమ్మెల్యేగా,ఒకసారిఎంపీగా,రెండు సార్లు మంత్రిగా మీకు సేవ చేసుకునే భాగ్యం కల్పించారన్నారు.

రాష్ట్రంలోనే ముఖ్య నాయకునిగా నన్ను నిలబెట్టారని అన్నారు. 48కి 48 డివిజన్ల కాంగ్రెస్ కార్పొరేటర్లు గెలిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగి ఎక్కువ నిధులు తెస్త.

మీ దీవెనతో నన్ను ఇంకా బలవంతుణ్ణి చేస్తారని ఆశిస్తున్న. హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓట‌ర్ల‌ను అభ్య‌ర్థించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button