సీఎం పై మాజీ మంత్రి ఫైర్‌

 

  • సీఎం స‌భ ఎన్నిక‌ల కోడ్ ఉల్లంఘ‌నే
  • ఎన్నిక‌ల క‌మిష‌న్ చ‌ర్యలు తీసుకోవాలి
  • చిల్ల‌ర మాట‌లు, అవే భూతులు
నల్గోండ, క్రైం మిర్ర‌ర్ః సీఎం రేవంత్ రెడ్డి నీతిమాలిన రాజ‌కీయాలు చేస్తున్నాడ‌ని మిరియాలగూడ‌లో నిర్వ‌హించిన స‌భ అర్థ ర‌హిత‌మ‌ని మాజీమంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి ఫైర్ అయ్యారు.
బుధ‌వారం నల్గొండ‌లో మున్సిప‌ల్ ఎన్నికల ప్ర‌చార కార్య‌క్ర‌మంలో బీఆర్ ఎస్ అభ్య‌ర్థుల త‌రుపున పాల్గొని మాట్లాడారు.
ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉన్న శంకు స్థాప‌న‌లు చేశార‌ని మండిప‌డ్డారు. ఎన్నిక‌ల క‌మిష‌న్ వెంట‌నే స్పందించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.
సీఎం హోదాలో వ‌చ్చిన ఒక్క రూపాయి నిధులు ప్ర‌క‌టించ‌కుండా చిల్ల‌ర మాట‌లు, అదేభూతులు మాట్లాడి త‌న ప‌రువు తీసుకుంటున్నాడ‌ని ఎద్దేవా చేశారు.
మిర్యాలగూడ‌లో త‌మ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే భాస్క‌ర్ రావుపై అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి రాజకీయాలు మొత్తం డివర్షన్ పాలిటిక్స్ అని, ప్రజలు ఆయన మాటలను న‌మ్మే ప‌రిస్థితిలో లేర‌ని దుయ్య‌బ‌ట్టారు.
రైతుల‌కు రైతు బందు ఎగ్గోట్టార‌ని విమ‌ర్శించారు. ఎన్నికల‌నుదృష్టిలో పెట్టుకొని రైతుల‌ను మ‌రోసారి మోసం చేసేందుకు రైతు బందు ఇస్తాన‌ని మభ్య‌పెడుతున్నాడ‌న్నారు.
ఈ మాట‌లు ఎవ‌రు న‌మ్మ‌వ‌ద్ద‌న్నారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల‌ను ఓడ‌గొట్టి గ‌ట్టి బుద్ది చెప్పాల‌ని పిలుపునిచ్చారు.
ఈ కార్య‌క్ర‌మంలో  నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button