తెలంగాణ రాజకీయాలన్ని డ్రగ్స్, రేవ్, లిక్కర్ పార్టీల చుట్టే తిరుగుతున్నాయి. జన్వాడ ఫాంహౌజ్ ఘటనతో కేటీఆర్ ఫ్యామిలీని కాంగ్రెస్, బీజేపీ టార్గెచ్ చేస్తున్నాయి. అదే స్థాయిలో బీఆర్ఎల్ లీడర్లు కౌంటర్లు ఇస్తున్నారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మంత్రులను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణకు చెందిన ఒక మంత్రి రోజు 2 ఫుల్ బాటిళ్లు మందు తాగుతాడని కాంగ్రెస్ వాళ్లే చెప్పుకుంటున్నారని అన్నారు. రెండు ఫుల్ బాటిల్స్ తాగకపోతే ఆయనకే నిద్రపట్టదని జగదీశ్ రెడ్డి అన్నారు. ఆ మంత్రి అమెరికాకు వెళ్తే ఉదయం లేచినప్పటి నుంచి మంచి నీళ్ళు ముట్టుకోకుండా మందు తాగుతాడని చెప్పారు. కాంగ్రెస్ నాయకులే మా ఇండ్లల్లో రైడ్ చేస్తే ఇంకా ఎక్కువ మందు బాటిళ్లు దొరుకుతాయి కదా అని నవ్వుకుంటున్నారని జగదీష్ రెడ్డి అన్నారు.
రేవంత్ రెడ్డి స్పెషల్ పోలీసులకు భయపడి వాళ్లని తీసేసి ఆర్మ్‌డ్ పోలీసులను పెట్టుకున్నావు..రేపు ఆర్మ్‌డ్ పోలీసులకు కూడా భయపడితే, చంద్రబాబు నాయుడును అడిగి ఆంధ్ర పోలీసులను తెచ్చుకుంటావా? లేదా పోయి ఆంధ్రలో కూర్చుంటావా? అని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి అల్లుడు ఉన్నాడు కాబట్టి ఆంధ్రలో ఉంటాడేమో.. మరి మంత్రులు ఎటు వెళ్తారని సెటైర్లు వేశారు.
Read More : కేటీఆర్ భార్యను పట్టించింది హరీష్ రావు భార్యేనా?
రోడ్లను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి బయటకి అడుగు పెడితే ట్యాక్స్ కట్టించుకోవాలని చూస్తున్నారని జగదీశ్ రెడ్డి ఆరోపించారు.అదానీ, అంబానీ, మేఘ కృష్ణా రెడ్డి, రాఘవ కన్స్ట్రక్షన్ వీళ్లలో ఎవరికో ఒకరికి ఇచ్చి డబ్బులు దొబ్బాలని చూస్తున్నారని అన్నారు. బాంబులు అంటే ఇదా..ప్రజల నెత్తి మీద భారం వేయడమే బాంబులా? అని నిలదీశారు జగదీశ్ రెడ్డి. కరెంట్ చార్జీలు పెంచాలని చూశారని తాము పోరాటం చేస్తే వెనక్కి తగ్గారని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తెలిపారు.